అమ్మ అంటే ఎవరు? - శారదా అశోకవర్ధన్

అమ్మ అంటే ఎవరు? - శారదా అశోకవర్ధన్   అమ్మ అంటే నీకు జన్మ నిచ్చిన పునీత! నవమాసాలు మోసి తన రక్తాన్ని నీకు పంచి ప్రాణం పోసిన దేవత తన ఒడి నిన్ను భద్రంగా దాచుకునే గుడి నీకు మాట నేర్పేబడి అది నీకు నడక నేర్పే మైదానం నీకు నడత నేర్పే విద్యాలయం అమ్మ పెట్టే ముద్దు కొండంత హాయినిస్తుంది అమ్మ కౌగిలింత నునువెచ్చగా చుట్టుకుంటుంది అమ్మ తలపే ఒక ఊయల బొమ్మగా చేసి నిన్ను ఊగిస్తుంది అమ్మ పిలుపే ఒక పాట పలికిస్తుంది వేనవేల రాగాలు నీ నోట ఆపదలో వున్నా ఏ పనిలో వున్నా అమ్మా అనే మాట అలుపు తీరుస్తుంది ఆనందాన్నిస్తుంది మకరందంలోని తీయదనంలా మమతలను పంచుతుంది అమ్మ రూపం కనిపించే దైవం అమ్మలో ఒక భాగం జీవమున్న మనం అందుకే- అమ్మని అవమానపరచకు అవస్థ పెట్టకు పాలుతాగిన రొమ్మునుంచి రక్తాన్ని పీల్చకు గుండె గాయపరచకు ఆమెకు పెట్టే పట్టెడు మెతుకులకు లెక్కలు కట్టకు!  

పండగ - శారదా అశోకవర్ధన్

పండగ - శారదా అశోకవర్ధన్   ఉగాదినా మరేదైనా కొత్త అనేది రోజులో లేదు సంవత్సరంలో లేదు- సూర్యుడు కొత్త రంగు పులుముకొస్తాడా గాలి కొత్త వాసనలు చిమ్ముకొస్తుందా అవే పూలు అవే కాయలు అవే రుచులు అవే గతులు మనిషి కోరుకునే కొత్తదనానికి ముద్దు పేరు - పండగ! రొటీన్ జీవితం బోరుకొట్టక బయట పడే మార్గం - పండగ తనకు తానే నియమ నిబంధనల హర్మ్యాన్ని నిర్మించుకోవడానికి దోహదం - పండగ స్నేహ సంపదను పంచుకోవడానికి పదిలంగా పెంచుకున్న నిండిన 'పాదు'-పండగ మానవత్వం పాలు పంచుకోవడానికి 'పొదుగు'-పండగ నూతనత్వం గుండెనిండా అడుగడుగునా నింపుకుంటూ కష్టసుఖాలను సమంగా ఎంచుకుంటూ సాగిపోయే బాటసారికి ప్రతినిత్యం పండగే - మనిషిగా జీవించడమే మనకు అసలైన పండగ

కొలిమిలో కాలితేనే! - శారదా అశోకవర్ధన్

కొలిమిలో కాలితేనే! - శారదా అశోకవర్ధన్   వెన్నెల జలతారులను ఒంటినిండా కప్పుకుని వేంచేసిన ఆకాశరాజు వెండి దారాల కంబళ్ళు అల్లి గుండె గుండెలో చలువ పందిళ్ళు వేసి కవ్వించినా తనకీ తెలుసు తన క్షీణదశ మర్నాటి నుంచే ప్రారంభమని   అయినా వెన్నెల దీపాన్ని వెలిగించక మానడు నెలరేడు ఎంత విశాల హృదయమతనిది? క్షీణించినా సరే పిదప ముందుగా రాణించాలానే తపన అది మానవ జీవితాలలో క్షణమైనా తానే వెలుగై వ్యాపించి తీయని గుర్తుగా మిగిలిపోవాలనే ఆరాటం అతనిది! నిలిగగనంలో తెప్పల తేలిపోయే తెలిమబ్బులు ఒక్కసారే నేలను స్పర్శించి ఆమనీ అందాలను తిలకించి పులకించిపోవాలని కాస్సేపయినా పుడమితల్లిని చల్లని తేమతో నింపెయ్యాలనే కోరిక ధరణిని దర్శించగానే తన ఉనికే ఉండబోదన్న సత్యం తెలిసిన సరే మబ్బులకెందుకో అంత ఉబలాటం భువికి జలువారక మానవు ఎంత ఉదార స్వభావం వాటికీ? క్షణికమైన పృథ్వితో తమ మైత్రి నిలుపుకోవాలని ఆ పరుగుల పోరాటం! మండు టెండలు మాడ్చేస్తున్నా గ్రీష్మతాపం గొంతు తడినార్పేస్తున్నా త్రాగడానికి గ్రుక్కెడు నీళ్లు లేక గున్నమామిడి వాడి వదలిపోతున్నా మేయడానికి మావిచిగురులు పసరులేక ఎండిపోతున్నా కోయిలమ్మ వగరాకు ఎందుకే మురిసిపోతూ గలసీమ దాటి గంధర్వలోకాలు మేలుకునేలా రాగాలు వినిపించకమానదు దానికెంత గొప్పబుద్ది? మానవాళికి మనసారా తృప్తి పరచాలని! మనిషి మాత్రం క్షణం క్షణం మారుతాడు మాట తప్పుతాడు మమత చంపుకుంటాడు తన స్వార్ధంకోసం మారణహోమానికైనా సిద్దపడతాడు వెన్నెలకీ వసంతానికీ ఎంత తేడా! త్యాగం వాటి లక్షణం స్వార్ధం మానవుడి లక్షణం! ఎన్ని మబ్బులు తొంగి చూసినా ఎన్ని మబ్బులు వెండి బిళ్లల్లా భూమిపైకి దుమికినా అన్ని రుచుల ఉగాది పచ్చడి ఎంత వేదాంతాన్ని రంగరించి తినిపించినా స్వార్ధాన్ని రుచి చూసి ధన పిపాసతో దప్పిక తీర్చుకునే వ్యక్తికి ఇవన్నీ శుష్కనినాదాలే! మెట్ట వేదాంతాలే!! ఎదురు దెబ్బలు తింటేనే ఎంత వారైనా మారేది కొలిమిలో కాలితేనే ఇనుమైనా వంగేది

ఇంగలంతో - శారదా అశోకవర్ధన్

ఇంగలంతో - శారదాఅశోకవర్ధన్   'జెన్నత్ 'నుంచి అల్లా దిగొచ్చినా 'వైకుంఠం'నుంచి విష్ణువు నడిచోచ్చినా 'పరలోకం'నుండి జీసెస్ తిరిగొచ్చినా వారి పేరిట మనుషులు చేసే   కరాళనృత్యాలను చూసి కన్నీరు పెట్టక మానరు మతాల పేరిట మారణహొమాల మంటలు చూసి గతుక్కుమంటూ విచారించకపోరు! హితం కానీ మతం కోసం బతుకు కట్టే సమాధులు చూసి వికృత చేష్టల వినోదాలు చూసి శోకించక మానరు! మనిషి! ఎందుకు ఏరంత పారే నీ ఆలోచనా తరంగాలను అవని అంత విసృతం చేసుకుని హాయిగా జీవించక తెల్లని కాగితంలాంటి మనసుమీద విషాన్ని చిలికించుకొంటావ్ నీకు నువ్వే గిరిగీసుకుని కుంచించుకుపోతూ చిన్న గూటిలో వుంటానంటావ్? కాలం ఆగదు నీకోసం గాలం వేసి పట్టలన్నా అరచేత్తో బంధించి అపాలన్నా కనపడకుండానే జారిపోయి పారిపోతుంది కాలాన్ని కదలనివ్వకుండా కాపలా కాసినా కరిగిపోతుంది నీ మార్గం మార్చుకో మనిషి నీ మేధకు పదును పెట్టి మనీషిగా మారు కలాతితుడై కాలంతో చెయ్యి కలుపు మబ్బుల కడలిలో మెరుపుల వెలుగును ముతగట్టుకో మానవతను పెంచుకుని ఈ ప్రపంచాన్ని స్వర్గంగా మార్చుకో స్వర్గమంటే ఇరుకు బతుకుల నేతల కదలే దాన్ని ఇంగలంతో తుడిచిపారెయ్    

ఇదేయాగం - శారదా అశోకవర్ధన్

ఇదే యాగం - శారదా అశోకవర్ధన్   పదమ్మ మహిళా పదమ్మ వనితా ముందుకు ముందుకు దుసుకుపోదాం అడుగులు ముందుకు వేస్తూ పోదాం ఎంతో చదివి ఎన్నెన్నో నేర్చీ కట్నం కోసం కాల్చి చంపే భర్త చేతిలో బలిపశువుగా ఎందుకు నిత్యం చేస్తూ బతికే పనికిరాని యీ పడవ ప్రయాణం పదమ్మ మహిళా పదమ్మ వనితా కొత్త లోకం దారులు వెతుకుతూ ముందుకు ముందుకు దుసుకుపోదాం పాత పాఠం మరిచిపోయి గొంతుకోసే కధలు వదిలి అడుగు ముందుకు వేస్తూ పోదాం నీ మంచిని ఎంచని వాళ్ళని నీ తెలివిని మెచ్చని వాళ్ళని సూటిపోటి తూటాల్ వదిలి నీ గుండెని గాయం చేసేవారిని ఎంత కాలమని భరిస్తావ్ చస్తూ బతుకును సాగిస్తావ్ అమ్మగా అలిగ తల్లిగా చెల్లిగ భాధ్యతలన్నీ నీవేనా భాదల గాధలు నీకేనా రక్షణ లేని పుచ్చు సమాజం నిర్లిప్తత నీలో నిందనింపుకుని దైర్యం చెయ్ సవాలు చెయ్ బయటి ప్రపంచపు వెలుగును చూసి ముందుకు నడిచే మర్గంవెయ్ పదమ్మ మహిళా పదమ్మ వనితా ఇదే యాగం ఇదే నినాదం శంఖారావం పూరించండి శక్తులు మిరై నడిపించండి పదమ్మ మహిళా పదమ్మ వనితా ముందుకు ముందుకు దుసుకుపోదాం అడుగులు ముందుకు వేస్తూ పోదాం    

కొత్త'నోటేషన్' రాసుకో! - శారదా అశోకవర్ధన్

కొత్త 'నోటేషన్' రాసుకో! - శారదా అశోకవర్ధన్   ఓటు కోసం సీటు కోసం నోటు కోసం ఎటు చూసిన కులాల పేరిట కుమ్ములాటలు మతాల పేరిట పోట్లాటలు మనిషికి మనిషికీ మధ్య ప్రేమలేదు అభిమానం లేదు బంధుత్వం లేదు స్నేహం లేదు కత్తులూ తుపాకులూ స్యై రవిహారం చేయగా తెగిపడ్డ కుత్తుకల రక్త తర్పణాలు బాంబుల బడభాగ్ని రేపే మంటలు కులమతాల ఉన్మాదం కుటిలత్వానికి నిదర్శనం! మనుషులను పొట్టన బెట్టుకుంటూ మానవతను నరుక్కుంటూ దేవుని పేరిట ఊరేగిపులూ ఉత్సవాలూ దైవత్వానికి ప్రతికలిమి పులివేషం కనబడకుండా దాచేందుకు కప్పుకున్న మేకచర్మం గొంగళి అబినయించేది భక్తికాదు కసిని కక్షని కలిపి ముద్ద చేసిన విషాన్ని దాచుకున్న వక్షస్థలం ఫై శాచిక క్రీడా వినోదానికి కేటాయించిన రంగస్థలం మానవత్వమే చచ్చిపోయాక మతాలుమిగిలేదేవరికోసం ? కులాల ఘోషలు ఎందుకోసం? ఈ గాండ్రింపులు ఓండ్రింపులు ఇంకా ఎందుకు? ఈ రంగస్థలానికి తెరిపడిపోవాలి కొత్త స్క్రిప్టును రాసుకుని కొత్త రాగాలను పలికిస్తూ గాత్రకచేరి చెయ్యాలి కొత్త నోటేషన్ రాగాలు రాసుకుని ఎండిపోయిన మోడునుంచి కొత్త చివుళ్ళు పూయించాలి పందిపోతున్న బతుకులకు ఆశలు కలిగించాలి! కులమతాలు గుండెను గుచ్చే ముళ్ళు తీసిపారెయ్ గుండేతూట్లు పడకుండా ఆప్యాయత హరివిల్లుని జివనాకాశంలో పూయించు బతుకునిండా సప్తవరాలను పండించు    

తెలుగును చూస్తున్నాను - శారదా అశోకవర్ధన్

తెలుగును చూస్తున్నాను - శారదా అశోకవర్ధన్   నేను పుట్టిన నాటి నుండి తెలుగు నా శ్వాస తెలుగే నా ధ్యాస అమ్మ ఒడిలో ఆటలడుతున్నప్పుడు మమతే నా భాష చందమామ వెలుగులో పాటలు పాడుతూ తెలుగును గుండె నిండా నింపుకుని నా జాతి వెలిగించిన తెలుగు దీపాల తోరణాలని చూసి పులకరిస్తూ తెలుగుతోటలో విహరిస్తున్నాను నా తాతలు పొందుపరుచుకున్న వారసత్వాన్ని సంతరించుకుని పారవశ్యంతో తెలిపోతున్నాను. తెలుగు భాషకు ముంగురులు సవరించిన నన్నయ నుంచి తెలుగును సీమంతరయానం చేయించిన 'బ్రౌను 'దాకా తెలుగుబవుటా ఎందరో ఎగురవేశారు తెలుగు తీపిని తెనేగిన్నేల్లో భద్రపరిచారు. తెలుగు మొగ్గలు విచ్చుకుంటూ పరిమళించే సారస్వత పుష్పాలై ప్రపంచమంతా విస్తరిస్తూ తెలుగు ఖ్యాతిని పెంచుతున్నాయి తెలుగు ప్రతిష్ట ప్రపంచమంతా గాలిలా వ్యాపించింది ఆ వెలుగులు జలతారుల నడుమ మెరిసిపోయే తెలుగు తేజాన్ని చూసి మురిసిపోయాను   ముత్యాల ఊయలలో ఊగిపోయాను కాలరితులు మారిపోతున్నాయి తెలుగు వారెవ్వరూ తెలుగులో మాట్లాడకపోవడం అదో వికృతదృశ్యం తెలుగు మాటను తెలుగు పాటను ఆటకఫైకెక్కించి తెలుగు జుట్టుని తెలుగు కట్టుని తెలుగు బొట్టుని కావ్యాల్లోనే మగ్గబెట్టేసే అస్తవ్యస్త సన్నివేశాన్ని చూసి ఆవేదన పడుతున్నాను   ఆందోళన పడుతున్నాను పండుగనాడు మాత్రమే ఫ్యాన్సి ద్రెస్సులా పంచెకట్టులూ పట్టుచీరలూ కట్టి తెలుగు తిండి గోడ్డుకారమంటూ ఆవకాయను చూడగానే అల్లల్లాడిపోయే తెలుగుడాబులని చూసి నవ్వుకుంటున్నాను సూపులెన్ని తాగినా కేకులేన్ని కొరికినా పచ్చిపులుసుని పరమాణ్సాన్ని చూసి లోట్టలేసేవారిని తలుచుకుని తెలుగులో ఎంత రుచి వుందో తెలుసుకుని తెగమురిసిపోతున్నాను ఏ విద్య నేర్చినా ఏ పదం కేక్కినా తెలుగురుచి తెలుగులకే తెలుసు తెలుగుతనం ఎక్కడున్నా తెలుస్తుంది తెలుగు కట్టు తెలుగు బొట్టు తెలుగు రుచి అభిరుచి చుక్కల్లో రోహిణిలగా నా తెలుగు తళుక్కున మెరుస్తుంది ఎక్కడున్నా తరగని కీర్తితో వెల్లివిరుస్తుందని నిరీక్షిస్తున్నాను అందుకే ఇంకా నా తెలుగు నిత్యచైతన్య స్రవంతిగా అగ్రస్తానన్నందుకుంటుందని నిఖిల జగత్తును చుట్టివస్తుందని నా తెలుగును చూస్తున్నాను కమలనయననై చంద్రవదననై.

నేనుమౌనంగా వెళ్ళిపోతాను- శైలజమిత్ర

నేను మౌనంగా వెళ్ళిపోతాను - శైలజమిత్ర   ఎవరికీ ఏమి కాకుండా ప్రతి ఇంటికి గడపలా   ముత్తైదువ నుదుటి సింధురంగా మెరుస్తున్నా....   ఆ మెరుపుల్ని పరదాల వెనుక దాచి ఉంచి.... ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతాను.   నిదురలో వచ్చే కలవరింతలా కన్నీటిలో వచ్చే నిరాశాలా ... కాలి అందెల చప్పుడు లేకుండా కనురెప్పలు అలానే తెరిచి ఉంచి   మనసు అంచుల మీద తడిబట్ట బరువుగా అరవేస్తే ఆ వత్తిడి కూడా తెలియకుండా నిదురలో నడిచినట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఒకానొకప్పుడు పాతికేళ్ళ కిందటి గొంతెత్తి ఏడ్చిన స్వేచ్చను తలుచుకుంటూ... ఎవరిని సలహా అడగకుండా సుదూరంగా వెళ్ళిపోతాను..   అలానే వెళ్ళినప్పుడు.... నాకోసం కన్నీరు కార్చకపోయినా భరిస్తాను నాఫై ప్రేమతో తలబాదుకోకున్నా సంతోషిస్తాను.   ఎందుకంటే.....ఒక మనిషిని ప్రేమిస్తే... అది చుట్టుకొని నీ వైపే అల్లుకుని నీతోనే ఉండిపోతుంది..... ఒక మనసును ద్వేషి స్తే... అదీ చుట్టుకొని నిన్ను అల్లుకొని..... నిన్ను కూడా దహించివేస్తుంది....  

పరమార్ధం- శైలజ మిత్ర

పరమార్ధం - శైలజ మిత్ర   ఒక తలుపు తెరిచి ఉంచు..... నిశ్శబ్దంగా నేను నిన్ను అనుసరించడానికి....   నీ దుఃఖాన్ని దాచి ఉంచు ...... నా సంతోషాన్ని నీతో పంచుకోవడానికి....   ఆశ నిరాశల మెరుపులకేం గాని .... అనుకోకుండా నీ చుట్టూ తిరిగే.... అసంతృప్తి గదిలోకి ప్రసరించే.... మనసును కనబడనంత దాచేయి ...   పగిలిన గుండె ముక్కల ఫైనా ఒక్కటంటే ఒక్క చిరునవ్వు... మచ్చుకయినా కనబడని ....   ఆవేదనలకి..... పగలు రాత్రి తేడాలుండవు.... ఆనందానికి..... ఏదో ఒక్క క్షణం అంటూ ఉండదు..... ఇన్ని వింత పోకడల్ని విషాదాల్ని .... తుడిచిన దైవాంశ సంభుతాన్ని... అనుభవిస్తున్న తన్మయత్వం శరీరం అంత వ్యాపిస్తే..... అదే జీవిత పరమార్ధం .....

సంధ్య వేళస్రవంతి రాగాలు - ఎమ్ . తుంగరాజన్

సంధ్య వేళస్రవంతి రాగాలు - ఎమ్ . తుంగరాజన్   నీలి నీలి మేఘాల నింగిలోని రాగాలు నాలోని భావాలూ నీ యవ్వన సరాగాలు కలలో కవ్వించే నవ్వుల నాయగారాలు కలంలో జాలువారు నీ ముంగురుల సోయగాలు   మనసంతా నీ దైతే వెన్నెలలు నా సొంతం వసంతాలు పొంగించేది ఈ ప్రేమ సరాగాలు సాగిపోవు ఈ జీవన స్రవంతి నీ కోసం  నింగిలోన సాటి నీ కెవ్వరు?   చిరునవ్వులు చిందించే అందాలు నీవే నిను దరిచేరు వేళలో తొలి జల్లులు రాగాలు పున్నమిలో కురిపించే వెన్నెల మనస్సు నీది వేణు గానాలుగా వినిపించేను నీ నవ్వుల హరివిల్లులు     పిల్ల తెమ్మెరల పూలరేకులు నీ కనుపాపలు              సంగీతంలో రాగాలు నీ కోసమే పుట్టేనులే సంధ్య వేళ స్రవంతిరాగాలు సాగించేనా సంబరంలో సోయగాల వొంపులన్ని వర్ణించినా   ఎదురుచూపు నీ కోసం ఎంత కాలమమ్మ ఎటువైపు చూచిన నీ పలకరింపుల కలవరాలు వెన్నెల వేళలందు దరిచేరు నీ జ్ఞాపకాలు

పుడమి తల్లి పదాలు- 5- పి.నీరజ

పుడమి తల్లి పదాలు- 5 - పి.నీరజ   లోభ బుద్దితో దాచి భూత దయనే మరచి తిరుగు వానితో పేచి ఓ పుడమి తల్లి   పిరికి వానిని నమ్మి మనసు ఇచ్చిన అమ్మి బాధ చెందును మమ్మి ఓ పుడమి తల్లి   స్వార్ద బుద్దిని పెంచి భూత దయనే తుంచి తిరుగు మరుడే బూచి ఓ పుడమి తల్లి   పెరిగే పెట్రోల్ వ్యయము ఎడ్ల బండ్లే నయము ఖర్చు తరిగే పదము ఓ పుడమి తల్లి   లంచ గొండుల శాఖ వ్యాయ భక్షక శాఖ నేటి రక్షణ శాఖ ఓ పుడమి తల్లి   భీతి గొల్పెడి కధలు సెక్సు సీనుల కధలు స్టార్ టీవీతో వెతలు ఓ పుడమి తల్లి   జాహ్నవి జటలందు జాబిల్లి శిరనందు శివునికే కనువిందు ఓ పుడమి తల్లి   ఎదుటి వారల తప్పు ఎన్ను చుండిన ముప్పు నీతి నీకును అప్పు, ఓ పుడమి తల్లి   లక్ష్మితోడను తగవు పుట్టలోనను నెలవు చేసె పెళ్ళికి అరువు ఓ పుడమి తల్లి   కట్న కానుక లంటు ఆలి తోడను అంటు తిరుగు వాడు పేషంటు ఓ పుడమి తల్లి   పొలిసు వారంటు పీ.వి .కి టంటు అన్నదో పార్లమెంటు ఓ పుడమి తల్లి   పరుల తప్పులు మరచి వారి చెలిమిని పెంచి తిరుగు మనిషే మంచి ఓ పుడమి తల్లి   పనిని చేయని పోరి మనిని మాత్రము కోరి మెలుగు మనిషే మారి ఓ పుడమి తల్లి   మాట చెప్పేడి వాడు గొప్ప కోరెడి వాడు పనుల జోలికి పోడు ఓ పుడమి తల్లి   పనులు చేసెడివాడు గొప్ప కోరని వాడు చెప్పి చేయడు ఎప్పుడు ఓ పుడమి తల్లి   కోడలు ఒక మనిషే అన్నది తాన్ మరసే అత్త ఒక రక్కసే ఓ పుడమి తల్లి   వంట వార్పులలోన అందె వేసిన లలన మగని మెప్పును వినున? ఓ పుడమి తల్లి   పరుల కష్టము చూచి సంతసించేడి బూచి కడకు తానే వగచి ఓ పుడమి తల్లి   రామ విభుని వేడి రామ పాదుక తోడి చనియె భరతుడు వీడి ఓ పుడమి తల్లి   పరుల వద్దను కూడు లాగు కొన్నను కీడు అంత కన్నను మాడు ఓ పుడమి తల్లి   విషము చిందేదినరుడు మృగము కన్నను ఘనుడు పామునకు సరిజోడు ఓ పుడమి తల్లి   మురళి లోలుని ఫైన చాల మక్కువ తోన నేను చేసాద రచన ఓ పుడమి తల్లి  

పుడమి తల్లి పదాలు -4 - పి. నీరజ

పుడమి తల్లి పదాలు -4 - పి. నీరజ   అదుపు తప్పిన ఖర్చు తలకుమించిన ఖర్చు పతనమునకు చేర్చు ఓ పుడమి తల్లి   పదవి కోసము చెప్పు తీపి మాటలు డప్పు మనకు తెచ్చును ముప్పు ఓ పుడమి తల్లి   కొంటె అల్లరి పిడుగు రమణ రాసిన బుడుగు గురువు పాలిట యముడు ఓ పుడమి తల్లి   కోటికాంతుల వెలుగు తేనె లొలికెడి తెలుగు భాషలన్నిటి మెరుగు ఓ పుడమి తల్లి   గాన గార్ధబ జంట గాన పోటీ కంట వెళ్లి పాడిన దంట ఓ పుడమి తల్లి   రామనామ మధురిమ అనుభవించిన హనుమ తెలిపె జనులకు మహిమ ఓ పుడమి తల్లి   తాను మెచ్చిన లలన తెలివి తేటల లోన అందె వేసిన జాణ ఓ పుడమి తల్లి   నగ్న తార్ల జోరు బూతు మాటల హోరు తెలుగు సినిమా తీరు ఓ పుడమి తల్లి   న్యూసు పేపరు లోన కల్ల వార్తలు వున్న నిజము తెలియుట సున్న ఓ పుడమి తల్లి   మందులసలే లేని వైద్యశాలలు అవని భారతదేశపు ధరణి ఓ పుడమి తల్లి   చదువు సంధ్యల యందు ఆట పాటలందు ప్రతిభ మనకే చెందు ఓ పుడమి తల్లి   ప్రేమ అనుబంధాలు భరత జాతి వరాలు చెరిగి పోని పదాలు ఓ పుడమి తల్లి   కుంభ కోణపు మంత్రి జనుల కానని కంత్రి మాట మర్చెడి కంత్రి ఓ పుడమి తల్లి   పరుల ఇంటను అప్పు తీసుకొనుటే తప్పు తృప్తి లేనిచో ముప్పు ఓ పుడమి తల్లి   సెక్సుకు విలువ వున్న కథకు విలువలు సున్న నేటి రచనలు కన్న ఓ పుడమి తల్లి   బోరుకొట్టెడు కథలు తెలుగు పలుకని ఘనులు దూరదర్శను జనులు ఓ పుడమి తల్లి   పసిడి పంటకు కరువు నల్ల ధనమునకు నెలవు రాజకీయపు ఎరుపు ఓ పుడమి తల్లి   పారిజాతపు సుమము అలకపురి పై రణము తెచ్చె వైరము నిజము ఓ పుడమి తల్లి   పగటి కలలను కనుచు వున్న దానిని విడిచు నరుడు చివరకు వగచు ఓ పుడమి తల్లి చదువు   కొనుటకు వెళ్లు యువతి యువకుల కాళ్లు సినిమా హాలుకు మళ్లు ఓ పుడమి తల్లి   జంట మర్రుల దోసె గిరిని వేలిన మోసె ఆలమందల కాసె ఓ పుడమి తల్లి   అప్పు భార్యల కన్న బృంద నాట్యము కన్న రాధ చెలిమే మిన్న ఓ పుడమి తల్లి   కృష్ణ పౌరుష నారి సత్య గర్వపు నారి కుంతి నిండగు నారి ఓ పుడమి తల్లి   శకుని కపటపు కంత్రి విదుర దేనువగు మంత్రి సంజయు డలవగు మంత్రి ఓ పుడమి తల్లి   విద్య వినయము నేర్చు విద్య యోచన నేర్చు విద్యమంచొన నేర్చు ఓ పుడమి తల్లి   చెట్టు ఫలమును ఇచ్చు గోవు పాలను ఇచ్చు నరుడు శోకమును ఇచ్చు ఓ పుడమి తల్లి   స్వాహ చేయుట వరకు నాయకులకే ఇరుకు లోటు బడ్జెటు మనకు ఓ పుడమి తల్లి   పక్షిజాతికి వున్న అయిక మత్యము మిన్న మనకు అదియే సున్న ఓ పుడమి తల్లి   కల్ల మాటలు వాని దారి తెలియని వాని వెంట వెళ్ళుట హాని ఓ పుడమి తల్లి   గుడ్లగూబల జంట గుడ్లు తినుటకు నంట పగలు వెళ్లిన నంట ఓ పుడమి తల్లి   జంతు జాలము అన్న భూత దయతో వున్న నరుడు ఉత్తము డన్న ఓ పుడమి తల్లి    

పుడమి తల్లి పదాలు - 3 - పి. నీరజ

పుడమి తల్లి పదాలు - 3 - పి. నీరజ   వార కాంతల చెలిమి తాగు బోతుల చెలిమి మండు నిప్పుల కొలిమి ఓ పుడమితల్లి   పెరిగె డీసిల్ విలువ పెరిగె పెట్రోల్ విలువ తరిగె రూపీ విలువ ఓ పుడమితల్లి   కాంతులందరి నోట వాసుదేవుని మాట ప్రేమకదియే బాట ఓ పుడమితల్లి   లేని గొప్పలు పోయి ఆస్తి చేసెను గోయి అయ్యె అప్పులు వేయి ఓ పుడమితల్లి   ఆత్మవంచన తగదు ఆత్మనుతియా వలదు మనకు పరువే నగదు ఓ పుడమితల్లి   వయసు ఉన్నను కాని మాట మన్నన లేని నరుని కలిసిన హాని ఓ పుడమితల్లి   చిన్ని పాపల నవ్వు పరిమళంబుల పువ్వు మనకు అదియే లవ్వు ఓ పుడమితల్లి   ఒంటరితనము తోడి బతుకు గడుపుట వీడి మెలగు సంఘము తోడి ఓ పుడమితల్లి   అంధకారపు పొరలు తొలగినపుడే మేలు ముక్తికదియే మొదలు ఓ పుడమితల్లి   మనసు కలిసిన చెలిమి కాదు ఎన్నడు కొలిమి అదియె మనకును కలిమి ఓ పుడమితల్లి   రెండు నాల్కల వాని అతిగ పోగిడెడి వాని నమ్మి యుండుట హాని ఓ పుడమితల్లి   కష్ట కాలము లోను కాచె కౌంతేయులను కేశవుడు ఇలలోను ఓ పుడమితల్లి   నిండి వున్నయి రేయి మనసు కెంతో ఎంతో హాయి వెతలు తీరుచు నోయి ఓ పుడమితల్లి   ముసలి తనయున హజము ముప్పు తెచ్చుట నిజము మార్పు కొనుమభితము ఓ పుడమితల్లి   ఆంగ్లేయులానాడు దేశీయులీనాడు స్ వేచ్చ లేదేనాడు ఓ పుడమితల్లి   ఆలి వైనను కాలు విసరు చండెడి పూలు విషయము చిందేడి తేలు ఓ పుడమితల్లి   ఇంటి యందలి పనులు చక్కదిద్దెడి ఘనులు ఇంటిలోని స్త్రీలు ఓ పుడమితల్లి   భీతితోడను మనము బతుకు గడిపిన విధము మరచి పోయిన సుఖము ఓ పుడమితల్లి   అధిక సంతతి తగదు ఇద్దరుండిన నగదు అంత కంటే వలదు ఓ పుడమితల్లి   జీవనదులకు నెలవు పాడిపంటల తరువు అయినా వున్నది కరువు ఓ పుడమితల్లి  

పుడమి తల్లి పదాలు -2 - పి. నీరజ

పుడమి తల్లి పదాలు -2 - పి. నీరజ   వార కాంతల చెలిమి తాగు బోతుల చెలిమి మండు నిప్పుల కొలిమి ఓ పుడమితల్లి   పెరిగె డీసిల్ విలువ పెరిగె పెట్రోల్ విలువ తరిగె రూపీ విలువ ఓ పుడమితల్లి   కాంతులందరి నోట వాసుదేవుని మాట ప్రేమకదియే బాట ఓ పుడమితల్లి   లేని గొప్పలు పోయి ఆస్తి చేసెను గోయి అయ్యె అప్పులు వేయి ఓ పుడమితల్లి   ఆత్మవంచన తగదు ఆత్మనుతియా వలదు మనకు పరువే నగదు ఓ పుడమితల్లి   వయసు ఉన్నను కాని మాట మన్నన లేని నరుని కలిసిన హాని ఓ పుడమితల్లి   చిన్ని పాపల నవ్వు పరిమళంబుల పువ్వు మనకు అదియే లవ్వు ఓ పుడమితల్లి   ఒంటరితనము తోడి బతుకు గడుపుట వీడి మెలగు సంఘము తోడి ఓ పుడమితల్లి   అంధకారపు పొరలు తొలగినపుడే మేలు ముక్తికదియే మొదలు ఓ పుడమితల్లి   మనసు కలిసిన చెలిమి కాదు ఎన్నడు కొలిమి అదియె మనకును కలిమి ఓ పుడమితల్లి   రెండు నాల్కల వాని అతిగ పోగిడెడి వాని నమ్మి యుండుట హాని ఓ పుడమితల్లి   కష్ట కాలము లోను కాచె కౌంతేయులను కేశవుడు ఇలలోను ఓ పుడమితల్లి   నిండి వున్నయి రేయి మనసు కెంతో ఎంతో హాయి వెతలు తీరుచు నోయి ఓ పుడమితల్లి   ముసలి తనయున హజము ముప్పు తెచ్చుట నిజము మార్పు కొనుమభితము ఓ పుడమితల్లి   ఆంగ్లేయులానాడు దేశీయులీనాడు స్వేచ్చ లేదేనాడు ఓ పుడమితల్లి   ఆలి వైనను కాలు విసరు చండెడి పూలు విషయము చిందేడి తేలు ఓ పుడమితల్లి   ఇంటి యందలి పనులు చక్కదిద్దెడి ఘనులు ఇంటిలోని స్త్రీలు ఓ పుడమితల్లి   భీతితోడను మనము బతుకు గడిపిన విధము మరచి పోయిన సుఖము ఓ పుడమితల్లి   అధిక సంతతి తగదు ఇద్దరుండిన నగదు అంత కంటే వలదు ఓ పుడమితల్లి   జీవనదులకు నెలవు పాడిపంటల తరువు అయినా వున్నది కరువు ఓ పుడమితల్లి

పుడమితల్లి పదాలు -1 - కె. నీరజ

పుడమితల్లి పదాలు -1 -శ్రీమతి.కె. నీరజ   రుధిరంబు అలరారు ఈనాటి కాశ్మీరు తలచినా బేజారు ఓ పుడమితల్లి   మమ్మేలే వేస్టేజి ప్రభుతనో స్టోరేజి పవర్ కట్ మస్ట్ జీ ఓ పుడమితల్లి   నదుల లోనికి దూకు నేటి బస్సుల షోకు చూచుచుండిన షాకు ఓ పుడమితల్లి   ఒకనాడు ధర్మంబు అలనాడు కర్మంబు ఈనాడు మర్మంబు ఓ పుడమితల్లి   చర్చల్తో హాటెక్కు కాల్పుల్తో హీటెక్కు పేరేమో హైటెక్కు ఓ పుడమితల్లి   తరలించె ఆంగ్లేయుల్ తెగమింగే నాయకుల్ దిగమింగే దేశీయుల్ ఓ పుడమితల్లి   చీలేటి పార్టీలు మారేటి పీయమ్ లు మిడ్ టరమ్ పోలింగ్ లు ఓ పుడమితల్లి   పార్టీల కలెక్షన్స్ బంధుల సెలక్షన్స్ మిడ్ టరమ్ ఎలక్షన్స్ ఓ పుడమితల్లి   వసుధలో సౌధంబు కంటేను సాధ్యంబు రోదశీ వయనంబు ఓ పుడమితల్లి   చెరకు వింటితో మరుడు రుచితో కలువ రేడు స్టెన్నుగన్ టో నరుడు ఓ పుడమితల్లి   గరుడి పైనను అజుడు దున్న పైనను యముడు నరుడి పైనే నరుడు ఓ పుడమితల్లి   ఒంపు సొంపుల కొమ్మ పులకరింతల రెమ్మ బాపు గీసిన బొమ్మ ఓ పుడమితల్లి   రసరయ్య భరితాలు ఆహ్లాద వర్ణాలు రవివర్మ చిత్రాలు ఓ పుడమితల్లి   బాలమురళీ గళము ఆలకించిన జనము ఒడలు మరుచుట నిజము ఓ పుడమితల్లి  

అంకితం - పి. నీరజ

అంకితం - పి. నీరజ   ఎల్లరను నీ కరుణతో చల్లగ చూచేటి విశ్వసాక్షిణి, కూర్చిన్ అల్లీ ఈ శతకంబున తల్లీ గైకొను పదాలు దయతోనమ్మా.   పుడమి తల్లి పదాలు   కడలి దాటిన ఘనుడు కాల్చె లంకను అప్తుడు అతడు అంజని సుతుడు ఓ పుడమి తల్లి   కళను నమ్మినవాడు ఇలను నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు ఓ పుడమి తల్లి   కరుణతోడను మనము మెలగినపుడే సుఖము మంచి జరుగును నిజమే ఓ పుడమి తల్లి   మనసు తెలియని మగడు కష్టపెట్టెడి ఘనుడు ఆలి పాలిట యముడు ఓ పుడమి తల్లి   రాజకీయ హవాల దేశమునకు దివాల జనులు అది మరువాల ఓ పుడమి తల్లి   ఆడి తప్పిన వాని అప్పు తీర్చని వాని నమ్మియుండుట హాని ఓ పుడమి తల్లి   కష్ట కాలము నందు కలిసి యుండెడి పొందు ధరణిలో కను విందు ఓ పుడమి తల్లి   ఎరుపు సొమ్ములు బరువు చేయకెన్నడు అరువు అదియే నీకును పరువు ఓ పుడమి తల్లి   ధరణి పుత్రిక సీత గీత దాటుట చేత అట్లు అయ్యెను రాత ఓ పుడమి తల్లి   ఆలు బిడ్డలు విడచి అన్యకాంతను వలచి తిరుగు వానితో పేచి ఓ పుడమి తల్లి  

అక్షరం నా ఆయుధం - జయంపుకృష్ణ

అక్షరం నా ఆయుధం - జయంపుకృష్ణ     అంతరంగం - నా ఆశల మందిరం- అక్షరం నా ఆయుధం- భవిష్యత్తు ఓ రంగులకల అన్వేషిస్తాను   విసిరి, ఓ శ్రామిక వల- కన్నీటికణాన్ని క నురెప్పలమధ్య వత్తి, కత్తిరించి కాంతినివెలిగిస్తాను- చీకటిని కూకటివేళ్లతో పెళ్లగిస్తాను   ఆ వెలుగులో దశదిశలా నడుస్తాను ఆర్తుల అశ్రుకణాలను తుడుస్తాను- అక్షరాన్ని అక్షరాన్ని చెకుముకి కొట్టి సరికొత్త జ్వాలను భుగభుగ పుట్టిస్తాను-   పపృథ్విలో నిబిడీకృతమైవున్న స్వార్ధాన్ని గబగబ నెట్టేస్తాను- చుట్టూ వున్న కన్నీళ్ల, కష్టాల ప్రక్షాళన కోసం చివరికి నన్ను నేను దహించుకుని నేనేవెలుగై లోకాన్నంతా వ్యాపిస్తాను శోకాన్ని రూపుమాపేస్తాను-