మరుపు -వి.కె. సుజాత
posted on Jan 12, 2012
మరుపు
- వి.కె. సుజాత
ఒకరికి నేను వరంలా పరిణమిస్తే
మరొకరికి శావంలా పరిణమిస్తాను
స్థితిని బట్టి గతులు మారుస్తాను
విషాదపరుల్ని నేను చేరితే... వరంగా గోచరిస్తాను
సంబరాల వేళ చేరితే.... శావంలా పరిణమిస్తాను
బాల్యంలో సానతో, యౌవనంలో శ్రద్ధతో
నన్ను మీ దరి చేరనీయరు
మధ్యవయస్సులో సమస్యలతో
సతమతమయ్యే వారిని మెల్లి మెల్లిగా తప్పటడుగులతో
దరిచేరుతాను
అలసిపోయిన మందమతులను, ముసలివారిని
నేను నీడలా వెంటాడుతూ ఉంటాను