ఇదేయాగం - శారదా అశోకవర్ధన్
posted on Jan 12, 2012
ఇదే యాగం
- శారదా అశోకవర్ధన్
పదమ్మ మహిళా
పదమ్మ వనితా
ముందుకు ముందుకు దుసుకుపోదాం
అడుగులు ముందుకు వేస్తూ పోదాం
ఎంతో చదివి ఎన్నెన్నో నేర్చీ
కట్నం కోసం కాల్చి చంపే
భర్త చేతిలో బలిపశువుగా
ఎందుకు నిత్యం చేస్తూ బతికే
పనికిరాని యీ పడవ ప్రయాణం
పదమ్మ మహిళా
పదమ్మ వనితా
కొత్త లోకం దారులు వెతుకుతూ
ముందుకు ముందుకు దుసుకుపోదాం
పాత పాఠం మరిచిపోయి
గొంతుకోసే కధలు వదిలి
అడుగు ముందుకు వేస్తూ పోదాం
నీ మంచిని ఎంచని వాళ్ళని
నీ తెలివిని మెచ్చని వాళ్ళని
సూటిపోటి తూటాల్ వదిలి
నీ గుండెని గాయం చేసేవారిని
ఎంత కాలమని భరిస్తావ్
చస్తూ బతుకును సాగిస్తావ్
అమ్మగా అలిగ తల్లిగా చెల్లిగ
భాధ్యతలన్నీ నీవేనా
భాదల గాధలు నీకేనా
రక్షణ లేని పుచ్చు సమాజం
నిర్లిప్తత నీలో నిందనింపుకుని
దైర్యం చెయ్ సవాలు చెయ్
బయటి ప్రపంచపు వెలుగును చూసి
ముందుకు నడిచే మర్గంవెయ్
పదమ్మ మహిళా
పదమ్మ వనితా
ఇదే యాగం ఇదే నినాదం
శంఖారావం పూరించండి
శక్తులు మిరై నడిపించండి
పదమ్మ మహిళా
పదమ్మ వనితా
ముందుకు ముందుకు దుసుకుపోదాం
అడుగులు ముందుకు వేస్తూ పోదాం