జనని జన్మభూమి
posted on Jan 12, 2021
జనని జన్మభూమి
అమ్మ ఆలనాపాలనలో
అమ్మ చెప్పే మంచి మాటలో
అమ్మ ప్రేమకు రూపం
అందమైన వివేకం
ఎదుగుతున్న తరుణంలో
అల్లరితనంతో నేస్తాలతో
ఆడిన ఆటపాటలతో
అలుపెరుగని చైతన్యం
చిలిపితనంతో అల్లరి సృష్టించిన
చదువునెపుడు తనమదిలో ముద్రించుకున్న జ్ఞాన తేజస్సు
నరేంద్రుడి సొంతం
ఆటల ప్రపంచం నుండి
జ్ఞనలోకం చేరేపుడు
పుస్తకాలను నేస్తాలుగా మలుచుకున్న జ్ఞాన సూర్యుడు
గురువుతో నేర్చిన జ్ఞానం
ఆద్యాత్మిక లోకం చూయించింది
తనేంటో తెలుసుకుని అడుగెసిన యువకుడు
సమాజంలో ప్రతిపరిస్థితినుండి
ప్రతికూలతలకు పరిష్కారం వెదికిన వేదజ్ఞాని
అమ్మనేర్పిన సంస్కారం
అమెరికాను సైతం ఆశ్చర్యపరిచింది
భారతీయుల ఖ్యాతి నలుదశలకు వెలిగింది
యువతకు మేలుకొలుపు
ఆయన చెప్పిన ప్రతిపలుకు
నిర్లక్ష్యం తరిమేందుకు
లక్ష్యం చేరేంతవరకు
సి. శేఖర్(సియస్సార్)