ఎవరికి వారు
posted on Jan 9, 2021
ఎవరికి వారు
ఎవరిని అడగాలి
ఆ ఎవరెస్టు ఎంత పాతది...
ఆ పడమటి కనుమలు ఎంత పాతవి...
ఆకాశంలోని తారలు ఎప్పటివి...
ఎవరికి వారు ఇలానే ఆలోచిస్తారా..
లేక
ఎవరి పనుల్లో వారు నిమగ్నులైపోయారా..
ఎవరికి వారు ఏమీ కారు
ఎవరి దేహం వారిదే
కాల్చాక ఎవరి బూడిద వారిదే
ఉన్నప్పుడు ఎవరికి వారు...
లేనప్పుడు ఎవరికి వారు...
ఎవరున్నారు ఈ లోకంలో
ఎవరికి ఎవరు ఏమవుతారు ఈలోకంలో
ఏది శాశ్వతం కాదు అనుకుంటూనే
ఎవరికి వారు బ్రతికే సమాజంలో
ఎవరో ఒకరు
ఎప్పుడో అప్పుడు
మునుముందు తరాల భవిష్యత్తుకు
పోరాడుతూనే ఉంటారు
పోరా అని తిడుతూనే ఉంటారు...
ఐనా...
ఇవన్నీ మనకెందుకు...
ఇవేవి మనకు పట్టవు...
మనకు మనం కూడా ఏమీ కాము...
ఎందుకంటే
ఎవరికి వారు కదా...
-
-Malleshailu