వీరుడా సలాం!!

వీరుడా సలాం!!

 

ముష్కరులు సృష్టించే రణరంగంలో 
ఎదురొడ్డి నిలబడే తెగువ 
లోకంలో ఎక్కడెతికినా కనబడదు
దేశం నీ రక్షణలో వెలిగే దీపం
ఆరిపోకుండా అహర్నిశలు నీవు తనువడ్డుపెట్టీ క్షణం క్షణం కాపాడుతున్న కంచెవైనవు
నీ గుండెధైర్యం ఎగిరేజెండా రెపరెపలలో కనిపిస్తుంది
అమ్మ నాన్నలు ఆలుబిడ్డలు
బందుమిత్రులు అందరూ నీకు నీ దేశమే 
యుద్దరంగంలో అడుగెట్టినపుడు సడలని సంకల్పంతో జాతిని కాపాడే
పిరంగివై దూసుకెల్తావ్
అణుబాంబులకు సైతం ఎదురెల్లే బెదురులేని దేశగౌరవం నీవు
తనువుమొత్తం తునాతునకలై మాంసపుముద్దలుగా ప్రాణాలర్పించినపుడు
జెండాపై ఎగిసిపడే 
అశోకచక్రం మీరౌతరు
భరతమాత గర్భగుడిలో పరమవీరచక్రలు మీరే
మీ వీరత్వం భరతజాతి
చరగని చరిత్రలో చిరంజీవులెపుడు మీరే
మీ సేవకు మేమెపుడు చేస్తాం
సలాం సలాం

 

సి. శేఖర్(సియస్సార్)