ఆమె "అనంతం"
posted on Mar 19, 2021
అవనికున్నంత "ఓపిక"
ఆమెకే సొంతం
పుట్టినప్పటినుండి "ఇంటిలో" వెలుగౌతుంది
పెరుగుతున్నపుడు "ప్రేమానురాగాలకు" చిరునామవుతుంది
ఆమె మాటలు మనసుకు "ఓదార్పునిచ్చే వెన్నెలవుతది"
మార్యదకు మారుపేరవుతుంది
చదువుసంధ్యల్లో మేటిగా నిలిచి "తననుతానే" నిర్మించుకుని ఆదర్శమౌతుంది
వేసే అడగడుగులో వెనక్కిలాగే "గాలాలను" తొలగించుకుంటూ
"విజయశిఖరాలనదిరోహిస్తది"
ఆధిక్యత ఆధిపత్యాన్ని తట్టుకుంటూనే
"అజరామరమైన అవకాశాలు" అందుకుంటూ
"ఏ రంగంలోనైన" రాణించగల నేర్పరితనాన్ని అద్దుకుంటుంది
"అణిచివేతల చట్రంలోంచి"
అంతరిక్షంలోకెగిరింది
కుటుంబ "భారం" మోస్తూనే
"సంప్రదాయలను" నిలబెడతది
అవనినంత మోసే "అనంతశక్తి మహిళ"
సృష్టిలో ప్రతిపనిలో మహిళమణులెందరో...!
అందుకోండి మా సలామ్!!
లోకమంత మీకెపుడు గులాం!!!
సి. శేఖర్(సియస్సార్)