చిత్రం బహుముఖ పత్రం

చిత్రం బహుముఖ పత్రం


 

అమ్మగా  సృష్టికి  మూలం ఆమె
ఆరాధనలో  పరిశోధనగా  ఆమె
సహనశీలి  గృహలక్ష్మి  గా  ఆమె
రచయిత్రిగా జ్ఞానసరశ్వతి ఆమె

బొమ్మా బొరుసుల  అపురూపం ఆమె
ఆమె లేక  లోకాలే  లేవని యోచించి
ఆమె కోసం  తపోధనుడైన  బ్రహ్మర్షి
బొమ్మలో (64) కళ లద్దిన బ్రహ్మ ఘనం

అమ్మ  వడిలో  ఆడుకొనే  బొమ్మ మనం
భారాన్ని భరిస్తున్నా ననే  ఆలోచన నుండి
భర్త   మనసు ను    భాద్యతగా  మార్చి
అతనిలో సగభాగం అర్ధాంగి గా మారి

ప్రతి యేటా    మార్చి లో    ఎనిమిదై
ఆ  ఒక్క  రోజు    విశ్వంలో    పెన్నిధై
తన పిల్లలకు భవిష్య యాగ తపస్వి
అందుకే ఆమె లోకమాతగా యశస్వి


✍🏻  మహేంద్ర  పి.బి.