పిచ్చుకమ్మా!

పిచ్చుకమ్మా!

 

 

పిచ్చుకమ్మా
నీ జాడలెక్కడమ్మా..?
కిచకిచమని పలుకులతో
తెల్లారే రోజులెక్కడమ్మా..?
గుంపుగా వచ్చి
మీరు చేసే అల్లరెక్కడమ్మా..?
గడ్డిపరకలు తెచ్చి
మీరు అల్లుకునే గూడులెక్కడమ్మా..?
ఇల్లంతా కలియతిరిగే
మీ పరుగులెక్కడమ్మా..?
రోజు పండగలా వచ్చే
మీ సందడెక్కడమ్మా..?
ఒంటరయ్యావా..
ఓ పిచ్చుకమ్మా 
సోపతులంతెక్కడమ్మా..?
మారిన కాలాలు
మిమ్మల్ని కాలగర్భంలో
కలిపేశయా...?
మానవత్వం మరచిన
మనుషులను విడిచి వెళ్ళావా..?
పిచ్చుకమ్మా పిలుపు వినవా
మళ్ళీ కానరావా..?

 

- బి. శ్వేత