గుండెధైర్యం
posted on Mar 24, 2021
గుండెధైర్యం
సైనికుడు ధైర్యాన్ని నింపుకుని
దేశ శౌర్యాన్ని తనువంతా కప్పుకుని
శత్రుమూకలను పౌరుషంతో తరిమి
ఉరుమై మెరుపై పగలనకా.. రాత్రనకా
చైతన్య సూర్యుడై నిలబడతాడు
మన కలలకు కాపలాదారుడు
చావుకెదురెల్లె తెగువున్నోడు
ఏదేమైనా అతడే మనం
అతని సేవకు ఏమిచ్చిన తక్కువె
గౌరవించాలందరం సైనికున్నెపుడు
అతడెపుడు
ఆకాశమంత ఎత్తు
యం. సింహాద్రి