భగత్ సింగ్
posted on Mar 25, 2021
భగత్ సింగ్
భగత్ సింగ్ వీరుడు
భయపడని ధీరుడు
దేశమే ఆయన ఊపిరి
ఏదేమైన పోరాటమే సలిపిరి
తిరుగుబాటు చైతన్యం
తిరుగులేని గుండెధైర్యం
దేశంకోసమే ఉద్యమం
దేహమంతా ఉత్సాహం
తెల్లోడి గుండెల్లో సింహస్వప్నం
తెగువతో నడిపించే
స్వతంత్ర సమరం
భరతమాత ముద్దుబిడ్డ
బలియైపోయిన పోరుబిడ్డ
ఆయన అందరికీ ఆదర్శం
నడవాలందరం ఆయన చూపిన మార్గం
పి. సుహాసిని