posted on Oct 6, 2020
నేను
తీరం చేరని అల నేను నేలని తాకని చినుకు నేను చీకటిని చీల్చని వెన్నెల నేను గమ్యం తెలియని గమనం నేను నాతో నేను నాకై నేను నాకు నేను నాకన్నీ నేను ఎవరో నేను ఎవరికి ఏమీ కాను.
- గంగసాని