అలక-అల్లరి

అలక-అల్లరి

 

మా ఇల్లు అనురాగాలకు నెలవు
అమనాన్నలు పంచే ప్రేమకు
నిలయం
తోబుట్టువులతో ఆటపాటలు అల్లరి కురిసే ఆకాశం
అందులో నాదే గారాభం
నా అలక మా ఇంటికి ఆభరణం
చూడాలపుడు నా కోసం అందరూ కలిసి అలక తీర్చేందుకు పడే ఆరాటం
ఆ ఆరాటం నా పోరాటం
ఇల్లంతా విజయాలయం
నవ్వులైతే పువ్వులైతవి
ఆ నవ్వుల పరిమళం    
వాడిపోక సాగుతుంటది
ఇల్లంటే స్వాతంత్ర్య స్థలం
మనలోని ప్రతీదానికది చిరునామా...!!!

 

 

బి. అనూష