అమ్మ
posted on Oct 21, 2020
అమ్మ
అమ్మ అనే ఆ పిలుపులో
ఎంత మాధుర్యం దాగుందో
పసితనాన్ని తన ఒడిలో లాలిస్తది
చిన్ని కడుపుకు ఆకలేస్తే
చందమామను చూయిస్తూ
తినిపిస్తది
బుడుబుడు అడుగులను
ఆనందంతో కనిపెడతది
చిన్నదెబ్బ తగిలిన తాను
విలవిలాడుతది
ముద్దు మురిపాలను
బిడ్డలందరికి పంచిపెడతది
పిల్లల కోసమే
ఆమే చేసే పూజలన్నీ
నోచే నోములన్నీ
అల్లరెంత చేసిన ఆనందంగా
హత్తుకుంటది
అమ్మ ప్రేమ ముందు
అమృతం కూడా చిన్నదే
- జి. పూజ