నాన్నే నా స్నేహితుడు
posted on Oct 15, 2020
నాన్నే నా స్నేహితుడు
అమ్మ జన్మనిచ్చిన
ప్రేమెంత కురిపించినా
నాన్నెపుడు కొండంత ధైర్యం
కోరినదేదైన కష్టాన్నిదాచి
మనముందుంచుతాడు
ఆయన కలలన్నీ
నే బావుండాలనే
సమాజంలో మర్యాద నేర్పి
నేర్పును ఓర్పును నేర్పేది నాన్న
తప్పటడుగులు పడినా
సరిచేసి సాధన నేర్పే గురువు నాన్న
నవ్వుతూ నవ్విస్తూ
నవ వసంతాలు నింపేది నాన్న
కలిమి లేములలో తొణకని సూర్యడౌతాడు నాన్న
నా నవ్వుకు కారణం నాన్న
నాన్నే నా బతుకు భగవంతుడు
సదా పాదాభివందనం
జి.కీర్తి