పరిస్థితులు

పరిస్థితులు

జీవనగమనంలో
పరిస్థితులెప్పటికి ఒకేలా వుండవు
రోజురోజుకోలా మారిపోతుంటయ్
మనకంతుపట్టవు అర్థంకావు
అంచనాకసలందవు
ఇపుడున్న
రోజులేమిరోజులో ఏమైతుందో
తెలియదసలు
మనుషులను మనసారా కలుసుకోలేక
ఏమైనా తమలోతామే పోరాటంచేస్తూ
దూరపు పిలుపులతో రోజులు
భారంగా గడుపుతున్నరు
మంచిలేదు చెడులేదు
అంతా అయోమయంలో 
అడుగులేస్తున్నరు
ఈ సంగ్రామంలో గెలుపు కాలనిదా? కాయనిదా?
అందుకే
గతం మరచిపో
గమనించి నడుచుకో
ఆశలశ్వాసలలో మనందరీ
భవిష్యత్తున్నది

సి. శేఖర్(సియస్సార్)