టమోటా మసాలా బజ్జీ
కావలసిన పదార్థాలు :
టమోటాలు - 1/2 kg
బంగాళాదుంపలు - 1/2kg
నూనె - వేయించేందుకు సరిపడా
గరంమసాలా - 2tsp
కొత్తిమీర - 1cup
పెసరపప్పు - 4tsp
ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 4
శనగపిండి - 1cup
తయారు చేయు విధానం:
* టమోటాలను ఒకే సైజుగా ఉండేటట్టు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
* పెసరపప్పును, బంగాళాదుంపలను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. టమోటాల్లో
గుజ్జు, విత్తనాలను తీసేసి పక్కనుంచాలి.
* ఇప్పుడు ఉడికించిన పప్పు, బంగాళాదుంపల మిశ్రమంలో గరంమసాలా, ఉప్పు,
ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా
చేసుకోవాలి.
* ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమోటాల్లో కూరాలి. ఈ టమోటాలను జా రుగా
కలిపి ఉంచిన శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్
వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే టమోటా మసాలా బజ్జీ రెడీ. వీటికి గ్రీన్ చట్నీ
కాంబినేషన్ చాలా బాగుంటుంది.