టమాట హల్వ!

 

 

కావలసినవి పదార్ధాలు :

ఎర్రని టమాటాలు  - ఆరు

నెయ్యి - అరకప్పు

పంచదార  - కప్పు

రవ్వ - అర కప్పు

బాదం, జీడిపప్పులు - అర కప్పు

యాలకులు పొడి - టీ స్పూన్  
 

తయారుచేయు విధానం :

* ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగి వాటిని ఉడకబెట్టుకోవాలి.

* ఇప్పుడు అందులో ఉన్న నీటిని వంపి.. మిక్సిలో గుజ్జుగా చేసి పక్కన పెట్టాలి.

*  స్టవ్ వెలిగించి ఒక బాణలి తీసుకొని అందులో నెయ్యి వేసి అది కాగాక జీడిపప్పులు, బాదం పప్పులు దోరగా వేపి ప్లేట్లోకి తీసుకోవాలి.

* ఇప్పుడు అదే నెయ్యి లో రవ్వ వేసి దోరగా వేపి, దానిలో రెండు కప్పుల నీళ్ళు పోసి వుడకనివ్వాలి.  

* రవ్వకాస్త గట్టిపడగానే టమాట గుజ్జు, పంచదార వేసి కలపాలి, బాగా చిక్కబడిన తరువాత యాలుకల పొడి, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, మిగిలిన నెయ్యి వేసి కలిపి ముద్దగా అయ్యిన తరువాత స్టవ్ ఆపాలి.

* ప్లేటుకి నెయ్యిరాసి ఈ మిశ్రమం వేసి సమంగా చేసి ముక్కలు కట్ చేసుకోవాలి. అంతే టమాట హల్వ రెడీ.