బాదుషా  స్వీట్  రెసిపి

 

 

కావలసిన వస్తువులు:

మైదా - 500 గ్రాములు
డాల్డా - 200 గ్రాములు
తినేసోడా - అర టీ స్పూను
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత
చక్కెర - 750 గ్రాములు
యాలుకల పొడి - 1 టీ స్పూను
నెయ్యి - 10 గ్రాములు
నీళ్లు - అర లీటరు


తయారు చేసే విధానం:

గిన్నెలో మైదా, సోడా, డాల్డా, తగినన్ని నీళ్లు వరుసగా కలిపి మిశ్రమాన్ని ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండ తీసుకుని దాన్ని గుండ్రంగా చేసి మధ్యలోకి నొక్కి బాండీలోని నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి. పంచదార, నీళ్ల మిశ్రమాన్ని తీసుకుని సన్నని సెగపై తీగపాకం వచ్చేవరకు మరిగించి, ఆపై యాలుకల పొడి, నెయ్యి వేసి కలిపి, వేయించి పెట్టుకున్న బాదుషాలు వేయాలి. పాకంలో పది నిమిషాల పాటు నానబెట్టి తీసేయాలి.