- Tasc 2013 Deepavali Celebrations A Historical Success In Los Angeles
- Tasc 2012 Star Nite Is Houseful
- Tasc Diwali Event Nov 5th
- సాహిత్యవేదిక ప్రథమ వార్షికోత్సవ వేడుకలు
- సాహితీ పూలు విరజిమ్మిన 'నెల నెలా తెలుగు వెన్నెల'
- టెక్సాస్ లో ఎల్ విఎస్ఆర్ కె కి ఘన సన్మానం
- "సాహిత్య వేదిక" తో పులకించిన టాంటెక్స్ తెలుగువారు
- వైవిధ్యభరితంగా టాస్క్ దీపావళి వేడుకలు
- టాంటెక్స్ సాహిత్య వేదికపై ఆముక్తమాల్యద నృత్యరూపకం
- కవితా రీతులపై సంకలనం విడుదలకు యోచన
- టాస్క్ ఆధ్వర్యంలో వనభోజనాలు
- టాంటెక్స్ ఆద్వర్యంలో జొన్న విత్తులకు సన్మానం
- టెక్సాస్ లో పార్ధు మధుర గానం
- సంప్రదాయ రీతిలో టాంటెక్స్ ఉగాది ఉత్సవ హేల
- పాతికేళ్ళ ప్రస్థానం: శోభాయమానంగా ముగిసిన టాంటెక్స్ రజతోత్సవ వేడుకలు
- డాలస్ లో 47వ నెల నెల తెలుగు వెన్నెల: శ్రీకృష్ణదేవరాయల పై ప్రత్యేక ప్రసంగం
- Tantex/iant Conducted The First Ever Tennis Tournament In Dallas
- టాంటెక్స్ “నెల నెలా తెలుగు వెన్నెల’’ నాటకరంగ సాహిత్యపు హోరు ...
- Youth Chair Monica Rani Performs At Ravindra Bharathi And On National Tv
- Picnic In Torrance By Tasc
- Ugadi Celebratory Event Organized By The Telugu Association Of Southern California’s (tasc)
- Sree Vikruthinama Ugadi Subakankhsalu From President’s Pen
- Tasc Diwali Celebrations
- Tasc Star Night Celebrations
- Tasc Conducts The 2009 Annual Summer Picnic
డల్లాస్ నగరంలోని డబ్లు.టి.వైట్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో 2011 ఏప్రిల్ 9న తాన్తాక్స్ సాంస్కృతిక కార్యదర్శి రాజేష్ చిలుకూరి ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన శాస్త్రీయ నృత్యాలు, చిత్రసంగీత నాట్య విన్యాసాలు నిర్వహించబడ్డాయి. ఈ ఉగాది (శ్రీ ఖర నామ సంవత్సరం) వేడుకలకు నగరంలోని తెలుగువారందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన ప్రేక్షకులను రాజేష్ చిలుకూరి స్వాగతం పలుకగా వేద పండితులు శ్రీ సాంబశివ శర్మ పంచాంగపఠనం, రాశి ఫలాలను గూర్చి వివరించారు.
ఉగాది పచ్చడి, కమ్మని విందు భోజనం, తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా పరిసరాల అలకరణ, పన్నీటి పుష్పాలతో స్వాగతం పలికాయి ఈ వేడుకలకు విజయ చంద్రహాస్, శ్రీమతి సమీర ఇల్లెందుల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సభ్యులకు, డల్లాస్ ప్రాంత తెలుగు ప్రజలందరికీ టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. అలాగే సభ్యులందరి ఆటవిడుపు కోసం పలుక్రీడలు, నేటితరం పిల్లల కోసం వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవటం కోసం స్ఫూర్తి కార్యక్రమం, ఆర్ధికసంవత్సరం చివర అందరి సౌలభ్యం కోసం పన్నుల ప్రణాళికా సదస్సు, సభ్యుల అవసరాలను తీర్చడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందనడానికి నిదర్శనం అన్నారు.
డల్లాస్ నగర కేంద్రంలోని బ్లాక్ అకాడమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లో జులై 8, 9 తేదీలలో జరగబోయే రజతోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చేపట్టబోయే కార్యక్రమ రూపురేఖలను వివరిస్తూ టాంటెక్స్ అంతరంగ సమితికి, కార్యవర్గ సభ్యులకు, ఔత్సాహికులైన సేవకులను ప్రత్యెక అభినందనలు తెలిపారు. రజతోత్సవ వేడుకలలో సభ్యులందరూ తమవంతుగా ఆర్ధిక, హార్థిక సహకారాలను అందించగలరని అన్నారు. ఈ వేడుకలు మరొక పాతిక సంవత్సరాల వరకు గుర్తుండిపోయే విధంగా నిర్వహించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.
దశాబ్దానికి పైగా ఉత్తర సంగీత, సాహిత్య, విజ్ఞాన, వినోదాలను అందిస్తున్న ఏకైక తెలుగు రేడియో “గానసుధ’’ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా సేవలందిస్తున్న పదునెనిమిది వ్యాఖ్యాతలకు పాలకమండలి అధిపతి శ్రీధర్ కోడెల, శ్రీమతి గీత దమ్మన్న జ్ఞాపికలతో సత్కరించారు. టాంటెక్స్ తక్షణ పూర్వాధక్షుడు చంద్ర కన్నెగంటి, శ్రీధర్ కోడెల, శ్రీమతి గీత దమ్మన్న టాంటెక్స్ కార్యవర్గ సభ్యుల హోదాలో అత్యున్నత సేవలందించి గత సంవత్సరం పదవివిరమణ చేసిన వెంకట్ ములుకుట్ల, రాజేష్ పిల్లమారి, వెంకట్ రెడ్డి ముసుకు, పాలకమండలి సభ్యుడు రవీంద్ర పండిటి లను మెమెంటోలతో సన్మానించారు.
టాంటెక్స్ వారు నిర్వహించిన భరతనాట్యం, కూచిపూడి, కథక్, జానపద, చిత్ర గీతాల నృత్యాలు ప్రేక్షకులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి. అలాగే ‘ఉగాది విందు’, ‘పద్మవ్యూహం’ అనే హాస్యనాటికలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. టాంటెక్స్ కార్యవర్గ సభ్యుల బృందం, స్ఫూర్తి బృందం ప్రదర్శించిన సినిమా గీతాల నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఈ వేడుకలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న వారికి, నృత్యాలతో ప్రేకక్షకులను మైమరిపించిన కళాకారులకు, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, టాంటెక్స్ మహాపోషక దాతలు బెలర్ మెడికల్ సెంటర్ ఎట్ అర్వింగ్, బాంబే సిజ్లర్స్, హౌరైజన్ ట్రావెల్స్, కోట రియాలిటీ అండ్ మార్ట్ గేజ్ సర్వీసెస్, ఒమేగా ట్రావెల్స్ అండ్ టూర్స్, పసంద్ ఇండియన్ క్యూసైన్, పెర్ఫెక్ట్ టాక్స్, ఇందు క్రియేషన్స్, తనమే జ్యువెలర్స్, మైటాక్స్ పైలర్,. రుచి ప్యాలెస్, సౌత్ ఫోర్క్ డెంటల్, వేడుకలలో పాల్గొన్న వారికి రుచికరమైన వంటకాలతో అలరించిన బాంబే సిజ్లర్స్ యాజమాన్యానానికి, ఉత్సవాలు నిర్వహించడానికి అనుమతించిన డబ్ల్యు.టి.వైట్ పాఠశాల యాజమాన్యానికి ఉగాది కార్యక్రమ సమన్వయకర్త రామకృష్ణ కోరాడ తమ హృదయపూర్వక అభినందనలను అందజేయడంతో వేడుకలు ముగిశాయి.