RELATED EVENTS
RELATED NEWS
EVENTS
Picnic in Torrance by TASC

Picnic in Torrance by TASCకాలిఫోర్నియా, మే 15 , తెలుగు అసోసియేషన్ ఆఫ్ సతరెన్ కాలిఫోర్నియా (టాస్క్) నిర్వహించిన వేసవి వనభోజనాలు ఎంతో ఆనందోత్సాహాలతో జరిగింది. దాదాపు 250 మంది ప్రవాసాంద్రులతో Torrance కొలంబియ పార్క్ లో, టాస్క్ ప్రెసిడెంట్ భారతి పిన్నింటి ఆధ్వర్యం లో చిన్నారులకు, ఆడవారికి, మగవారికి ఎన్నో ఆటల పోటిలతో పాటు చక్కటి సాంప్రదాయ వంటకాలు కమ్మటి తెలుగింటి మజ్జిగతో వనభోజనాలు ఎంతో సందడిగ సాగింది. Picnic in Torrance by TASC

 

ఈ సందర్భంగా నిర్వహించిన చిన్నారుల ఆర్ట్స్ పోటీలలో దివ్యన్షి – 1 ఏడు, సాయి అనుష్ – 2 ఏళ్ళు, భావన – 4 ఏళ్ళు, అమిత – 6 ఏళ్ళు, శ్రావ్య హొత – 7 ఏళ్ళు, సౌమ్య పెండిం – 11 ఏళ్ళు, శ్రావ్య కొత్త – 13 ఏళ్ళు గెలుపొందారు. త్రీ లెగ్ రేస్ లో సౌజన్య హొత, సౌమ్య పెండెం, రాష్మిక వేటూరి, భూమిక, ఆర్నావ్, లోకేష్, శ్రావ్య, ఇషా, నిషా, ఆశ్రిత బహుమతులు గెలుచుకున్నారు. మహిళల ఆటలపోటీలలో ఒన్ మినుట్ గేమ్స్ శ్రీదేవి మాదాల నిర్వహించిన బీన్స్ గేమ్ లో మొదతి బహుమతి రజిత, రెండోవ బహుమతి రాధిక గెలుపొందారు. ప్రైస్ ఇస్ రైట్ గేమ్ లో శైలజ మొదటి బహుమతి పొందగా, లావణ్య రెండోవ బహుమతి పొందారు. సమీర వేటూరి నిర్వహించి మ్యుసికాల్ చైర్స్ విత్ కార్డ్స్ గేమ్ లో కవిత మొదటి బహుమతి, సరిత రెండోవ బహుమతి పొందారు. సుధా కొత్త నిర్వహించిన పదంలో పదం గేమ్ లో శైలజ, మాధవి మొదటి బహుమతి, రాధిక రెండోవ బహుమతి గెలుచుకున్నారు. మగవారు క్రికెట్ మరియు వాలి బాల్ గేమ్ లతో పాటు ఇంకా టాగ్ అఫ్ వార్, సాక్ రేస్, ఖో ఖో లాంటి గేమ్ లతో అన్ని వయసులవారు ఆడుతు పాడుతు ఆనందోత్సహాలు వెదజల్లారు.

 

టాస్క్ అధ్యక్షురాలు భారతి పిన్నింటి ఈ సందర్భంగా వచ్చిన వారందరిని ఉదేశించి, ఈ కార్యక్రమం జయప్రదం కావటానికి సర్వదా శ్రమించిన టాస్క్ కోశాధికారి – విజయ్ భాస్కర్ నెక్కంటి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చైర్మాన్ – శ్యాం గుందాల, ఫుడ్ చైర్మన్ శివ నన్నపనేని, వేన్యు చైర్మన్ బెనర్జీ సున్కవల్లి, పబ్లిసిటీ చైర్మాన్ సతీష్ బండారు, శ్రీనివాస్ కొమిరిసెట్టి , లినింగస్టన్, శ్రీనివాస్ చావా, సమీర, సుధా, శ్రీదేవి, రాధిక, హరి మాదాల, శ్రీనివాస్ తిప్పర్తి, నరేంద్ర, మోహన్, వాలంట్యిర్స్ మరియు వచ్చిన వారందిరికి కృతగ్యత తెలిపారు. చక్కటి భోజనాలు స్పాన్సేర్ చేసిన వసంత భవన్ ప్రతాప్ గాదె గారికి, స్నాక్స్ స్పాన్సేర్ చేసిన అన్నపూర్ణ గార్డెన్స్, లాండేల్ రవీంద్ర గారికి, పిల్లల ఆర్ట్స్ పోటీల స్పాన్సేర్ GSR టెక్నాలజీస్ వారికీ ధన్యవాదాలు తెలియ చేసారు. టాస్క్ కు అందరి సహాయ సహకారములు ఎంతో అవసరమని తెలిపారు. టాస్క్ అడ్విసరి కమిటి మెంబెర్ మల్లిక్ బండ, కోశాధికారి విజయ్ భాస్కర్ నెక్కంటి, కలచరల్ చైర్మన్ ప్రసాద్ రాణి, స్పోర్ట్స్ చైర్మన్ శ్యాం గుందాల మరియు పోటి నిర్వాహులు బహుమతులు ప్రదానం చేస కార్యక్రమాన్ని ముగించారు.

Picnic in Torrance by TASC

Picnic in Torrance by TASC

TeluguOne For Your Business
About TeluguOne
;