- టాంటెక్స్ వారి పునస్సమాగమ వేడుక – పెల్లుబికిన గతస్మృతులు
- 83వ సదస్సులో "మనుచరిత్ర" కు పెద్దపీట
- టాంటెక్స్, టిప్స్ ఆధ్వర్యంలో ద్వితీయ వార్షిక ఉచిత వైద్య శిబిరం
- టాంటెక్స్ కార్య వర్గంలో నూతనోత్సాహం-2014 అధ్యక్షులుగా విజయ్ మోహన్ కాకర్ల ప్రమాణ స్వీకారం
- వాగ్గేయకార వైభవ " ఆధ్యక్షరి " : టాంటెక్స్ సాహిత్యవేదిక పై సంగీత స్వరరాగసంగమం
- Tantex Deepaavali Vedukalu-2013: Unprecedented Show Awaits In Dallas
- టాంటెక్స్ దీపావళి వేడుకలకు భారీగా ఏర్పాట్లు
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 73వ నెలనెలా తెలుగువెన్నెల
- Tantex 59th Nela Nela Telugu Vennela Music-literary Fest
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 82వ నెల నెలా తెలుగు వెన్నెల
- టాంటెక్స్ సాహిత్య వేదికపై తెలుగు వెన్నెల కురిపించిన ఉగాది కవి సమ్మేళనం: ఘనంగా ముగిసిన 81 వ సదస్సు
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 79వ “నెలనెలా తెలుగువెన్నెల”
- వైభవంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు
- ఘనంగా టాంటెక్స్ రియూనియన్ బాంక్వెట్ - అలరించిన సునీత సంగీత విభావరి
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సంయుక్తంగా కబడ్డీ, టెన్నికాయట్, త్రోబాల్ పొటీలను టాంటెక్స్ స్పోర్ట్స్ ప్రతినిధి వెంకట్ దండ, తానా స్పోర్ట్స్ ప్రతినిధి సాయి లింగ మరియు వారి బృంద కార్యనిర్వహణలో ఎంతో విజయవంతంగా జరిపించారు. చాలా మంది తెలుగు కుటుంబాలు వారి పిల్లలతో సహా ఉత్సాహముతో పాల్గొన్నారు.
పచ్చిక బయలు, నీటి కొలనులు మరియు అన్ని హంగులు కలిగినటువంటి కొపెల్ నగరములోని ఆండ్రు బ్రౌన్ పార్క్ ఈ అటలపొటీలకు ఆథిద్యాన్నిచ్చింది. టాంటెక్స్ అద్యక్షులు విజయ మోహన్ కాకర్ల క్రీడాకారులకు స్వాగతము పలికి, మన గ్రామీణ క్రీడలలో పాల్గొనేందుకు వచ్చిన అందరిని అభినందించారు. ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు పాల్గొనడము ఈపొటీలకు వన్నె తెచ్చిందన్నారు.
తానా ప్రాంతీయ ప్రతినిధి రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయన్నారు. తెలుగు వారి అభ్యున్నతికి తానా ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందన్నారు. క్రీడాకారులు తమ చిన్ననాటి అనుభూతులను గుర్తుచేసుకుంటూ ఎంతో ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.
కబడ్డీ పోటీలో టాంటెక్స్ కప్ ను భీమసేన జట్టు, తానా కప్ ను ఆష్టదిగ్గజాలు జట్టు గెల్చుకున్నాయి. టెన్నికాయట్ పోటీలో టాంటెక్స్ కప్ ను కపెల్ కిలాడి జట్టు, తానా కప్ ను కపెల్ కౌగర్ల్ జట్టు గెల్చుకున్నాయి. త్రోబాల్ పోటీలో టాంటెక్స్ కప్ ను మాధవి దివి మరియు నితీష కర్నాటి, తానా కప్ ను జాన్సి చామకూర మరియు శాంతి గున్న గెల్చుకున్నారు.
టాంటెక్స్ మరియు తానా సభ్యులు విజేతలను అభినందించారు. ఈ ఆటల పొటీలను ఘనంగా నిర్వహించిన స్వచ్చంద కార్యకర్తల సేవలను కొనియాడారు. ప్రసారమాధ్యమాలు దేసిప్లాజా, టీవీ9, టీవీ5, 6టీవీ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయము అల్పాహారము సమకూర్చిన సరిగమ రెస్తారంట్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.