RELATED NEWS
NEWS
టాంటెక్స్ దీపావళి వేడుకలకు భారీగా ఏర్పాట్లు

తారలు దిగివచ్చిన వేళ... వెలుగు జిలుగులు తెచ్చిన వేళ: టాంటెక్స్ దీపావళి వేడుకలకు భారీగా ఏర్పాట్లు

 

 

అక్కడ తారా జువ్వలు లేవు. కానీ తార లందించే  నవ్వులు మాత్రం మెండుగా ఉంటాయి.  భూచక్రాలు లేవు. కాని భూమిదద్ధరిల్లే కేరింతలు మాత్రం దండిగా ఉంటాయి. దాదాపు పదివేల తెలుగు కుటుంబాలున్న డాలస్- ఫోర్ట్ వర్త్ జంట నగర పరిసర ప్రాంతంలో ప్రతి వారాంతం కనీసం ఒక డజను  కార్యక్రమాలు లేకుండా ఎప్పుడూ ఉండదు. కాని దీపావళి అంటే మన తెలుగు వారి హృదయాలకు హత్తుకునే  పండుగ. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “దీపావళి వేడుకలు-2013” ఈ నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1.00 గం. లకు “అలెన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్”లో అత్యంత వైభవంగా జరపడానికి వేదిక సిద్ధమౌతోంది. గత 27 సంవత్సరాలుగా తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షిస్తూ, తెలుగు వారి అవసరాలకు అనుగుణంగా తమ కార్యక్రమాలను రూపుదిద్దుకుంటున్న టాంటెక్స్ (www.tantex.org) చరిత్రలో దీపావళి వేడుకలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.


ఈ సందర్భంగా టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ సురేష్ మండువ మాట్లాడుతూ “ఈ సంవత్సరం దీపావళి వేడుకలకు దాదాపు 1500 ప్రేక్షకులకు సరిపడే (ఇక్కడ క్లిక్ చేయండి) అధునాతనమైన ఆడిటోరియం “అలెన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్” తో బాటు ఒక పది మంది విభిన్న కళాకారులతో అందరినీ  అలరించే కార్యక్రమాలకు రూపకల్పన జరిగిందని అన్నారు. సకుటుంబ సపరివార సమేతంగా మన తెలుగు వారందరికీ సంస్థ తరపున మా ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని విజ్ఞప్తి చేసారు” 


సాంస్కృతిక సమన్వయకర్తల ద్వయం  శ్రీమతి కృష్ణవేణి శీలం మరియు శ్రీమతి జ్యోతి వనం తమ సంయుక్త ప్రకటనలో “ఈ సారి మన దీపావళి వేడుకలకు విచ్చేస్తున్న కళాకారులు మిమ్మల్ని వెండితెర మరియు బుల్లితెరలో అలరించిన వారే కావడం విశేషం. నంది పురస్కార గ్రహీత, ప్రముఖ గాయకుడు, బుల్లితెర వ్యాఖ్యాత సాగర్, “పాప్” సంగీతంలో సరికొత్త సంచలనం సృష్టించి, యువతను విశేషంగా ఆకట్టుకొన్న గాయనిమణి రనైనారెడ్డి,  కితకితలు లేకుండానే “జబర్దస్త్” గా మాట్లాడే బొమ్మలతో నవ్వించగల “రాకేష్”, విభిన్న కోణాలలో హాస్యపు చిరుజల్లులు  కురిపించే నవ్వుల హరిబాబు,  తన గళంతో ప్రముఖుల మన్ననలను అందుకొని ఆట పాటలతో మంత్రముగ్దులను చేసిన పృథ్వీ చంద్ర , “ఈగ” “దమ్ము” పాటలతో టాలీవుడ్లో దుమ్మురేపిన రాహుల్ సిప్లిగంజ్ మరియు  అందరు మెచ్చే వ్యాఖ్యాత,  పురస్కారాల పుట్ట, మాటల మాంత్రికుడు ప్రదీప్” అని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.  


మీకు నచ్చిన సీటును ముందుగానే కొనండి...ఏర్పాట్లలో టాంటెక్స్ కు సహకరించండి



దీపావళి వేడుకల కార్యక్రమ సమన్వయ కర్త శ్రీ బాల్కి చామ్కూర మాట్లాడుతూ “ప్రతి సీటుకు నంబరు ఉంటుంది. చివరి వరకు ఆగి నిరుచ్చాహ పడకుండా మీ టిక్కెట్లను ఈరోజే కొనండి. టిక్కెట్లకోసం ఇక్కడ క్లిక్ చేయండి. శీతాకాలం కాబట్టి కార్యక్రమాన్ని మధ్యాహ్న భోజనానంతరం ప్రారంభమౌతుంది. భోజనం 1:00 గం. లకు, కార్యక్రమం 2:30 గం. లకు ప్రారంభమౌతుంది” అని అన్నారు.  దీపావళి వేడుకలకు రుచికరమైన, నోరూరించే పసందైన “విందు” రెస్టారెంట్ వారి భోజనం మీకోసం సిద్ధమౌతుంది. ఈ కార్యక్రమ పోషకదాతలుగా టాంటెక్స్ కు  చేయూత నివ్వాలానుకుంటే president@tantex.org లేదా  secretary@tantex.org ని ఈమెయిలు ద్వారా లేక సమాచార పత్రంలో ఉన్న మిగతా కార్యవర్గ సభ్యులను సంప్రదించవలసినదిగా టాంటెక్స్ అభ్యర్ధన.

TeluguOne For Your Business
About TeluguOne
;