- టాంటెక్స్ వారి పునస్సమాగమ వేడుక – పెల్లుబికిన గతస్మృతులు
- 83వ సదస్సులో "మనుచరిత్ర" కు పెద్దపీట
- డల్లాస్ లో టాంటెక్స్ & తానా ఆధ్వర్యంలో ఘనంగా కబడ్డీ, టెన్నికాయట్, త్రోబాల్ పొటీలు
- టాంటెక్స్, టిప్స్ ఆధ్వర్యంలో ద్వితీయ వార్షిక ఉచిత వైద్య శిబిరం
- టాంటెక్స్ కార్య వర్గంలో నూతనోత్సాహం-2014 అధ్యక్షులుగా విజయ్ మోహన్ కాకర్ల ప్రమాణ స్వీకారం
- వాగ్గేయకార వైభవ " ఆధ్యక్షరి " : టాంటెక్స్ సాహిత్యవేదిక పై సంగీత స్వరరాగసంగమం
- Tantex Deepaavali Vedukalu-2013: Unprecedented Show Awaits In Dallas
- టాంటెక్స్ దీపావళి వేడుకలకు భారీగా ఏర్పాట్లు
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 73వ నెలనెలా తెలుగువెన్నెల
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 82వ నెల నెలా తెలుగు వెన్నెల
- టాంటెక్స్ సాహిత్య వేదికపై తెలుగు వెన్నెల కురిపించిన ఉగాది కవి సమ్మేళనం: ఘనంగా ముగిసిన 81 వ సదస్సు
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 79వ “నెలనెలా తెలుగువెన్నెల”
- వైభవంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు
- ఘనంగా టాంటెక్స్ రియూనియన్ బాంక్వెట్ - అలరించిన సునీత సంగీత విభావరి
సంగీత సాహిత్య సంగమాలతో ఓలలాడిన టాంటెక్స్ వారి 59 వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’:
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 59 వ సదస్సు, జూన్ 17 ఆదివారము నాడు రిచర్డసన్ లోని IANT కార్యాలయములో సంయుక్త కార్యదర్శి మరియు సాహిత్య వేదిక సమన్వయకర్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యము గారి అధ్యక్షతన జరిగినది.
డాల్లస్ ప్రాంత తెలుగుభాషాభిమానులు, సంగీతసాహిత్య ప్రియులు అత్యంత ఆసక్తి తోఈ కార్యక్రమములో పాల్గొన్నారు. ముందుగా ముఖ్యఅతిథి శ్రీ తిరుమల పెనుగొండ చక్రపాణి గారిని మద్దుకూరి చంద్రహాస్ సభకు పరిచయము చేస్తూ చక్రపాణిగారు ప్రధమంగా మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణగారి శిష్యులని, మహా విద్వాంసులైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం వంటివారిదగ్గర తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారనీ, పద్మభూషణ్ డా! శ్రీపాద పినాకపాణి గారి తంజావూరి సంగీత శైలి వారసత్వాన్ని అంది పుచ్చుకున్నారనీ, స్వయముగా షుమారు 125 అన్నమాచార్య కీర్తనలకు సంగీతము కూర్చి తిరుమల తిరుపతిదేవస్థానము వారికి సమర్పించారనీ, ఆయనతో మాట్లాడితే సంగీత సాహిత్యాల విషయంలో ఎన్నో విషయాలు తెలుస్తాయనీ చెప్పి, చక్రపాణి గారిని వేదికమీదకు ఆహ్వానించారు.
శ్రీమతి పులిగండ్ల శాంత, శ్రీమతి దమ్మన్న గీత చక్రపాణిగారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
తరువాత చక్రపాణి గారు "సంగీతములో సాహిత్యము" అనే అంశముపై సభనుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం కర్నాటక సంగీతం అని పిలవబడేది ఒకప్పుడు దాక్షిణాత్య సంగీతమని వ్యవహరించబడేది అని, అది వస్తుతః తెలుగువారిదేనని, సంగీత మూర్తిత్రయం అయిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి తెలుగువారేనని, వారితోపాటు ఈ సంగీతాన్ని పోషించిన దేవదాసీలు తెలుగువారేనని, తంజావూరు ప్రాంతంలో వర్ధిల్లింది కాబట్టి అదే ప్రస్తుతం తంజావూరు బాణీగా వ్యవహరించబడుతోదనీ చెప్పారు. ఇప్పటికీ తంజావూరు ప్రాంతంలోని మేలత్తూరు భాగవతులమేళం అంతా తెలుగులో జరుగుతుందనీ, అక్కడివారు తాము తెలుగువారిగానే చెప్పుకుంటారనీ అన్నారు. తెలుగుభాష అంత సంగీతానికి అనువైన భాష వేరే లేదనీ, ఈ విషయాలన్నీ తెలుగువారికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందనీ అన్నారు. ఏ సంగీతము నేర్చుకుంటే మరే సంగీతము నేర్చుకోవాలనే కోరికగాని అవసరముగాని ఉండదో అదే కర్ణాటక సంగీతము అని నిర్వచించారు.
త్యాగరాజ కీర్తనలలో భావానికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఉండదు అనే ఒక అపప్రథ ప్రజలలో ఉన్నది. అది తప్పు అని చెప్పారు. భావము లేక పోవటము కాదు. పాడేవానిలోని లోపము వలన ఆ భావాన్ని పలికించలేకపోవచ్చు అంతే గాని భావము లేక కాదు అని అభిప్రాయపడ్డారు. భాషతో చెప్పలేని భావాన్ని సంగీతముతో పలికించ వచ్చు, భాష అంతమైన చోటునుంచి సంగీతము మొదలవుతుంది అని సభికులకు వివరించారు. అనంతమైన భావాన్ని వ్యక్తపరచటము మాటలకు కుదరదు. అందుకు ఉదాహరణగా ఎన్నో త్యాగరాజ కీర్తనలను రాగయుక్తముగాను, కర్ణసుభగముగాను ఆలాపించి ఆయాకీర్తనలలోని లోతైన భావాలను సభికులకు వివరించారు.
అలాగే సంగీతము ఎలా నేర్చుకోవాలి, సంగీత విద్వాంసునికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి తదితర విషయాలను సభికులతో పంచుకున్నారు. సంగీతపరంగా మూడు వందల సంవత్సరాల పాటు స్తబ్ధముగా ఉన్న తెలుగువారు ఒక ‘శంకరాభరణం’ సినిమా ద్వారా మరల మరోఅడుగు ముందుకువేసారని అలాగే ఆ స్ఫూర్తిని, సంగీతము పట్ల అనురక్తిని, కొనసాగించే బాధ్యత తెలుగువారిదందరిదీ అని అభిప్రాయపడ్డారు. ఆ బృహత్కార్యములో తనవంతుగా ఏమైనా చేయటానికి సంసిద్ధమేనని సభాముఖముగా తెలియజేసారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు శ్రీమతి దమ్మన్నగీత, కార్యదర్శి డా.ఊరిమిండి నరసింహా రెడ్డి ఈ సదస్సులో ప్రసంగం గావించిన ముఖ్య అతిథి శ్రీ టి.పి. చక్రపాణి గారిని దుశ్శాలువతో సత్కరించారు.సాహిత్య వేదిక సభ్యులు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శ్రీ కాజ సురేష్, శ్రీ మల్లవరపు అనంత్, డా. జువ్వాడి రమణ, డా.ఊరిమిండి నరసింహా రెడ్డి,
శ్రీ బిల్లా ప్రవీణ్ ముఖ్య అతిథికి జ్ఞాపికను సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉత్తరాధ్యక్షుడు శ్రీ మండువ సురేష్ , కార్య నిర్వాహక సభ్యులు శ్రీ వేములపల్లి పూర్ణచంద్ర రావు, శ్రీమతి జుజారే రాజేశ్వరి,శ్రీమతి వనం జ్యోతి, శ్రీ వీర్నపు చినసత్యం, శ్రీ చామకూర బాల్కి మరియు శ్రీ చిట్టిమల్ల రఘు హాజరయ్యారు.