RELATED KIDS TALENT
KIDS TALENT
నాట్స్ సంబరాలు - రెండో రోజు సాయంత్రం విశేషాలు

 

నాట్స్ సంబరాలు - రెండో రోజు సాయంత్రం విశేషాలు

తెలుగువారంతా కలిసి సంబరాలు చేసుకోవడం సంతోషం : బన్నీ



జులై 1:షాంబర్గ్:  అమెరికా లో తెలుగువారంతా ఒక్క చోట చేరి ఇలా సంబరాలు చేసుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అంగరంగ వైభవంగా చికాగోలోని శ్యాంబర్గ్ లో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాలకు అల్లు అర్జున్ విచ్చేశారు.

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు, కామెడీ విలన్ సుబ్బరాజు,  హీరోయిన్  పూజా హెగ్డే  కూడా నాట్స్ సంబరాల్లో  పాల్గొన్నారు. నాట్స్ చైర్మన్ సామ్ మద్దాళి, ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, సంబరాల కన్వీనర్ రవి ఆచంట లు అతిధులను సాదరంగా సత్కరించారు.   నాట్స్ చేసిన సేవా కార్యక్రమాలపై ఒక ఆడియో & వీడియో ప్రదర్శించారు నిర్వాహకులు.



మోహన కృష్ణ మన్నవ తన అధ్యక్షోపన్యాసంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నాట్స్ చేసిన, చేస్తున్న సేవా కార్యక్రమాలపై మాట్లాడుతూ.. ఇల్లాంటి కార్యక్రమాలు సజావుగా జరగటానికి ఎంతో విలువైన కాలాన్ని వెచ్చించి నాట్స్ ను ముందుకు నడిపిస్తున్న బోర్డు కి ధ్యనవాదాలు తెలుపుతూ, తన కార్య నిర్వహణ సభ్యులను, స్టేట్ కోఆర్డినేటర్లను, జోనల్ వీక్ ప్రెసిడెంట్లను ప్రత్యేకంగా అభినందించి అందరినీ వేదిక పై పిలిచి, సభకు పరిచయం చేశారు. నిర్విఘ్నంగా  సంబరాలను నిర్వహిస్తున్న సంబరాల కమిటీ సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

 


తెలంగాణా రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్య నిర్వాహ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో అనేక మంది తెలుగు వారు ఎన్నో కష్ట నష్టాలు కు ఓర్చి, అమెరికా గడ్డ పై వృత్తి, వ్యాపార రంగాల్లో పై పైకి ఎదిగిన యువ వ్యాపారవేత్తలను అభినందించారు.అల్లాగే తెలుగు వారు అమెరికా రాజకీయాలలోకి రావాలని పిలుపు నిచ్చారు.  రాజకీయాలలో రాణిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. రేవంత్ రెడ్డి ప్రసంగం ఆద్యంతం సభికులని ఆకట్టుకుంది. అనంతరం, ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత రేవంత్ మ్యూజిక్ హంగామా

స్థానిక కళాకారులు, చిన్నారులు చేసిన మనలోని మనిషి నాటిక చూస్తున్న ఆహూతుల కళ్ళు చెమర్చాయి. ఈ చిన్న పిల్లలు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందించారు. అల్లాగే గోదా కళ్యాణం ఆముక్తమాల్యద ఆహూతులను కట్టిపడేశాయి.  ఈ మధ్యనే పరమపదించిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కు , సాహితీ వేత్త, కవి, జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి లకు నాట్స్ ఘనంగా నివాళులర్పించింది.

 

ఆలీ అండ్ పృధ్వీ అండ్ టీమ్  చేసిన కామెడీ నవ్వులు పువ్వులు పూయించింది.వారి  కామెడీకి విశేష స్పందన లభించింది. పగలనక రాత్రనక కష్టపడుతున్న వాలంటీర్ల సేవలన అందరూ అభినందించారు.  బావార్చి వారి విందుకు అన్ని వర్గాల అభిమానులనుండి మంచి స్పందన వచ్చింది. 

సంబరాల్లో రెండో రోజు చివరగా వచ్చిన రేవంత్ టీమ్ హుషారైన పాటలతో అందరిని చిందులు వేయించారు.. పాత కొత్త పాటలతో రేవంత్ టీమ్ చేసిన మ్యూజిక్ హంగామా తెలుగువారికి అంతులేని సంతోషాలు పంచింది.  రేపు జరగబోయే 3వ రోజు కార్యక్రమాలతో సంబరాలు ముగియనున్నాయి.

 

TeluguOne For Your Business
About TeluguOne
;