RELATED KIDS TALENT
KIDS TALENT
టెంపాలో నాట్స్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం


టెంపాలో నాట్స్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం

 

 


శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా ఉత్తమమైన మార్గమని యావత్ ప్రపంచానికి  భారత్ చాటింది. అంతర్జాతయ యోగా దినోత్సవంతో ఇప్పుడు యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. అమెరికాలో తెలుగు వారు కూడా  యోగాపై ఇప్పుడు మరింత మక్కువ చూపిస్తున్నారు..ఈ క్రమంలోనే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, ఇషా పౌండేషన్ తో కలిసి  టెంపాలో యోగా శిబిరాన్ని ఏర్పాటుచేసింది.ఉప యోగాను ఇక్కడకు వచ్చిన వారికి పరిచయంతో పాటు యోగాసనాలు, ధ్యానం నేర్పించారు.

 

 

దాదాపు 40 మందికిపైగా తెలుగువారు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎంతో సులభమైన ఉపా యోగ ద్వారా మనస్సును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవచ్చనేది ఈ శిబిరంలో నేర్పించారు. నాట్స్ టెంపా చాప్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని స్థానిక తెలుగువారు అభిలాషించారు.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;