RELATED ARTICLES
ARTICLES
డల్లాస్ లో టాంటెక్స్ మొట్టమొదటి క్రీడా టోర్నమెంట్ విజయవంతం

జులై 8 మరియు 9న డల్లాస్, బ్లాక్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లో టాంటెక్స్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా జరగబోయే వేడుకలలో భాగంగా 1962వ సంవత్సరంలో స్థాపించబడిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంయుక్తంగా “Let’s play Tennikoit and Kabaddi for fun and fitness and cherish the childhood memories’’ అనే స్లోగన్ తో కాప్పెల్ లోని అండీ బ్రౌన్ ఈస్ట్ పార్క్ లో టెన్నికాయిట్, కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. శనివారం ప్రొద్దుటినుండే టోర్నమెంట్ ను వీక్షించడానికి విచ్చేసిన వారికి టాంటెక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ చైర్ కృష్ణ కోరాడ స్వాగతం పలికారు.

భారతీయ సంస్కృతీ అల్పాహారం అందరూ ఆరగించారు. ఈ టోర్నమెంట్ కు విశేష స్పందన కనిపించింది. ఎనిమిది టెన్నికాయిట్ టీమ్ లు, డల్లాస్ ఫోర్ట్ వర్త్ నుండి ఆరు కబడ్డీ టీమ్ లు పాల్గొన్నాయి. టాంటెక్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గీతా దమ్మన్న, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ జాయింట్ సెక్రెటరీ బల్కి చంకురా ఈ టోర్నమెంట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా దామన్న మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ద్వారా తమ చిన్ననాటి జ్ఞాపకాలను నేమరవేసుకోవచ్చని, ఆరోగ్యం మెరుగుపర్చుకోవచ్చని, పోటీలలో పాల్గొనేవారు కీచులాడుకోకుండా సరదాగా ఆడాలని అన్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని క్రీడాస్ఫూర్తిని కనబర్చాలని చంకురా అన్నారు. నిష్ణాతులైన చైర్ ఎంపైర్, లైన్స్ మెన్, రిఫరీల ఆధ్వర్యంలో టెన్నికాయిట్, కబడ్డీ పోటీలు నివహించారు.

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన టెన్నికాయిట్ రౌండ్ రాబిన్ మ్యాచ్ లలో మొదటి రెండు స్థానాలలో నిలిచిన వారు ఫైనల్స్ లో తలపడ్డారు. కెప్టెన్ ప్రసూన నీలపరెడ్డి, ప్రసూన తరుగు టీమ్ వారు మొదటి స్థానాన్ని కైవశం చేసుకోగా, కెప్టెన్ జ్యోతి వనం, దీపిక సుర్సాని రెండవ స్థానంలో నిలిచారు. మురళి కొండేపాటి కెప్టెన్ గా వున్న ‘లగాన్’ కబడ్డీ టీమ్ మెంబర్లు మోహన్ గోలి, నాగార్జున గోర్ల, శ్రీనివాస దాసరి, ఆనంద్ రెడ్డి, కృష్ణ రెడ్డి గూడూరు, స్వెంతర్ పటేల్, అరవింద్ దాచిపల్లి, చంద్ర గదే, ప్రసాద్ కోరురు అలాగే శ్రీధర్ తుమ్మల కెప్టెన్ గా ఉన్న ‘కిలాడీస్’ కబడ్డీ టీమ్ మెంబర్లు నరేన్ రామిరెడ్డి, వెంకట్ కొండల, హరి కొండకల్ల, సతీష్ చిలుకుల, జానకి మనదాడి, నర్శిమ్హ్ రెడ్డి ఏలేటి, భాస్కర్ కృష్ణం శెట్టి శశాంక్ చెన్నుపల్లి, అనంత పుజ్జుర్ ఫైనల్స్ లో తలపడగా “లాగానే’’ టీమ్ మొదటి స్థానాన్ని, “కిలాడీస్” టీమ్ రెండవ స్థాన్నాన్ని కైవశం చేసుకున్నారు.

విజేతలను కృష్ణ కోరాడ అభినందించి ఈ సంవత్సరలో ఇలాంటి మరెన్నో పోటీలను నిర్వహిస్తామని అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. ఫైనల్స్ లో తలపడిన టెన్నికాయిట్ టీమ్ లకు దమ్మన్న, చంకురా జ్ఞాపికలను అందజేయగా, కబడ్డీ ఫైనల్స్ లో తలపడిన టీమ్ లకు టేక్ స్టార్ కన్సల్టింగ్ రఘు చిట్టిమల్ల, సురేష్ మండువ అధ్యక్షతన టాంటెక్స్ ఎగ్జిక్యూటి కమిటీ మెంబర్లు విజయ్ మోహన్ కాకర్ల, సుబ్బు జొన్నలగడ్డ, శేషా రావు బొడ్డు, కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, డాక్టర్ నరసింహా రెడ్డి ఉరిమిండి అభినందించి ట్రోఫీలను అందజేశారు.

ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నందుకు తమకు చాలా ఆనందంగా వుందని, తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు వచ్చాయని, ఇంతవరకూ పాల్గొన్న పోటీలలో కంటే ఇదే అత్యుత్తమమైనదని, తమను ప్రోత్సహించిన ప్రేక్షకులను తమ ధన్యవాదములని పోటీలలో పాల్గొన్న టీమ్స్ అన్నారు.

ఈవెంట్ కో-ఆర్డినేటర్ శ్రీలత కంది మాట్లాడుతూ ఈ పోటీల నిర్వహణలో తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి పోటీలలో పాల్గొన్నవారికి, రిఫరీలకు, లైన్ జడ్జలకు వాలంటీర్లకు తమ ధన్యవాదములు తెలియజేశారు. అలాగే ఈవెంట్ స్పాన్సరర్ టేక్ స్టార్ కన్సల్టింగ్ రఘు చిట్టిమల్ల, ఆడియో, వీడియో కవర్ చేసిన సుబ్బు దామిరెడ్డి మరియు రాజేంద్ర నారాయణదాస్ లకు, అస్పాహారం అందించిన సరెగమ ఇండియన్ కేఫ్, ఫన్ ఏషియా, TV9. ఏక్ నాజర్ మీడియా పార్టనర్స్ వారికి, పోటీలకు కావలసిన సదుపాయాలను సమకూర్చున అండీ బ్రౌన్ ఈస్ట్ పార్క్ స్టాఫ్ మరియు మేనేజ్ మెంట్ కు కృతజ్ఞతలను తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;