ARTICLES
నాట్స్ ప్రస్థానంలో మరో ముందడుగు

 


నాట్స్ ప్రస్థానంలో మరో ముందడుగు

కనెక్టికట్ లో కొత్త ఛాప్టర్ ప్రారంభించిన నాట్స్



నాట్స్ ప్రస్థానంలో మరో కీలకమైన  ముందడుగు పడింది. అమెరికాలో తెలుగుజాతి మేలు కోసం పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన పరిధిని మరింత విస్తరించుకుంటుంది. అమెరికాలో ప్రతి నగరానికి ప్రతి తెలుగువాడికి చేరువ అవుతుంది. తాజాగా అమెరికాలో కనెక్టికట్ లో నాట్స్ తన కొత్త ఛాప్టర్ ప్రారంభించింది. నాట్స్ మెంబర్ షిప్ జాతీయ సమన్వయ కర్త తరణి పరుచూరి ఆధ్వర్యంలో...కొత్త ఛాప్టర్ కు శ్రీకారం చుట్టారు. కనెక్ట్ కిట్ ఛాప్టర్ కు సమన్వయకర్తగా ప్రదీప్ గడ్డం వ్యవహారించనున్నారు. రాము మొక్కపాటి, గోపాలకృష్ణ ఈడె, నాగేంద్ర చావ, జగదీష్ దీరశాల, దినేష్ గోకవరపు, పవన్ గుమ్మడి, గణేష్ కపర్తితో పాటు అనేక మంది నాట్స్ సభ్యులుగా చేరారు. వీరంతా ఇక ముందు నాట్స్ చేపట్టే సేవా కార్యక్రమాలను కనెక్టికట్ లో మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. నాట్స్ కుటుంబసభ్యులుగా మారుతున్నారు. కనెక్టికట్ లో నాట్స్ ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రదీప్ గడ్డం స్థానిక తెలుగువారి మద్దతుతో భవిష్యత్తులో నాట్స్ నుంచి అనేక కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. . అమెరికా శ్వేత సౌధంలో సౌత్ ఏషియన్ యూత్ సింపోజియంను వరుసగా రెండోసారి ఘనంగా నిర్వహించిన నాట్స్.. అదే స్ఫూర్తితో ఇప్పుడు ముందుకు దూసుకుపోతోందని నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ అన్నారు. కనెక్ట్ కిట్ లో నాట్స్ టీం ను ఏర్పాటు చేసిన తరణి పరుచూరి, ప్రదీప్ గడ్డంలను అభినందించారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినాదంతో వచ్చిన నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కనెక్టికట్ సభ్యులకు వివరించారు.
 
కనెక్టికట్  లో నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్

 


కనెక్టికట్ లో నాట్స్ ఛాప్టర్ ప్రారంభం నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ తో శ్రీకారం చుట్టింది. తెలుగు వారు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో నాట్స్ నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది.15 టీంలు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాయి. రెండు రోజుల పాటు 21 మ్యాచ్ లు జరిగాయి. మాంచెస్టర్ హైస్కూలు, విండ్ సర్ లాక్స్ హైస్కూల్, విండ్ సర్ లాక్స్ మిడిల్ స్కూలు, విక్ హమ్ పార్క్ లు వేదికగా నిర్వహించిన ఈ క్రికెట్ మ్యాచ్  లకు క్రికెట్ అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. వారంతంలో తమ క్రీడా ప్రతిభను చాటేందుకు క్రికెటర్లు పోటీపడ్డారు. ఫైనల్ విజేతలకు నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ మురళీకృష్ణ మేడిచెర్ల, నాట్స్ నార్త్ ఈస్ట్ జోన్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, న్యూజెర్సీ కో ఆర్డినేటర్ వంశీకృష్ణ వెనిగళ్ల, నాట్స్ మెంబర్ షిప్  జాతీయ సమన్వయ కర్త తరణి పరుచూరి, నాట్స్ కనెక్టికట్ ఛాప్టర్ కో ఆర్డినేటర్ ప్రదీప్ గడ్డం బహుమతులు అందించారు. నాట్స్ కనెక్టికట్ ప్రాంతంలో తొలిసారిగా చేపట్టిన ఈ క్రికెట్ టోర్నమెంట్ ను దిగ్విజయంగా నిర్వహించినందుకు స్థానిక నాట్స్ టీం కు నాట్స్ జాతీయ నాయకత్వం ప్రత్యేక అభినందనలు తెలిపింది. కనెక్ట్ కిట్ లో చేపట్టే ఏ కార్యక్రమానికైనా తమ వంతు సంపూర్ణ మద్దతు, సహకారం అందిస్తామని ఈ సందర్భంగా నాట్స్ జాతీయ నాయకత్వం తెలిపింది.

 

TeluguOne For Your Business
About TeluguOne
;