ARTICLES
మనబడికి ​ప్రతిష్టాత్మక NATA ఎక్సెలెన్సీ "​విద్యాప్రదాయని​"​ పురస్కారం​!​


మనబడికి  ​ప్రతిష్టాత్మక NATA ఎక్సెలెన్సీ  "​విద్యాప్రదాయని​"​ పురస్కారం​!

 



గత 10 సంవత్సరాలలో అమెరికా వ్యాప్తంగా 35000 మంది విద్యార్ధులకు తెలుగు భాష నేర్పిస్తూ, తెలుగు భాషని ప్రాచీన భాషనుండి ప్రపంచ భాషగా తరువాతి తరానికి అందిస్తున్న సిలికానాంధ్ర మనబడికి​,​ ​ ​'ఉత్తర అమెరికా తెలుగు సమితి (​నాటా​)​, "విద్యా  ప్రదాయని​"​  పురస్కారం అందించింది. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన నాటా ​మెగా కన్వెన్షన్ వేదిక మీద​ నాటా​ అడ్వయిజరీ ​ ​కౌన్సిల్  ఛైర్మన్ ​శ్రీ ప్రేం కుమార్ రెడ్డి​ గారు​, ​ అధ్యక్షులు శ్రీ  రాజేశ్వర్ రెడ్డి, ​తదుపరి ​అధ్యక్షులు​ ​శ్రీ రాఘవ రెడ్డి ​గారు ​తదితరుల చేతులమీదుగా మనబడి ఉపాధ్యక్షులు​ శ్రీ ​ శరత్ వేట ​గారు ​ఈ పురస్కారం అందుకున్నారు.

 

 

తెలుగు భాష వ్యాప్తికి, మనబడి కార్యకలాపాలను గూర్చి ప్రత్యేక ​ఆడియో విజువల్ ని ప్రదర్శించి, మనబడి బృందం చేస్తున్న కృషిని అభినందించారు.​ తెలుగుభాషాభివృద్ధికై మనబడి సేవలను ​గుర్తించి ఇంతటి విశిష్ట పురస్కారాన్ని అందించినందుకు శరత్ వేట, NATA కుటుంబానికి మనః పూర్వక  ధన్యవాదాలు తెలియజేసి, ఈ అవార్డుతో  తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.

 



ఈ సందర్భంగా శరత్ వేట మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా 250 పైగా కేంద్రాలలో 1200 మందికి పైగా ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు,  భాషా సైనికుల సహకారంతో గత పది సంవత్సరాల​కు పైగా​ అమెరికా, కెనడా​లతో పాటు 10 ​ఇతర ​దేశాలలో 35​,​000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు భాష ​నేర్పించామని, గత సంవత్సరం 9,000 కు పైగా విద్యార్థులు మనబడిలో నమోదు చేసుకున్నారని తెలిపారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ACS-WASC (Western of Association of Schools and Colleges) వారి గుర్తింపు పొందిన ఏకైక తెలుగు బోధనా విధానం సిలికానాంధ్ర మనబడి అని, భారత దేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ఈ మనబడి విద్యా విధానానికి అమెరికాలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కు అర్హత కూడా లభిస్తోందని, తెలిపారు.

 

 

మనబడి సంచాలకులు ఫణి మాధవ్ కస్తూరి మాట్లాడుతూ సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరపు తరగతులు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమౌతున్నాయని, నమోదు చేసుకోవడానికి http://manabadi.siliconandhra.org ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. 'భాషాసేవయే భావితరాల సేవ ' అనే స్ఫూర్తితో సిలికానాంధ్ర మనబడి రేపటి తరాన్ని తెలుగు భాష సారధులుగా తీర్చిదిద్దడానికి ​అహర్నిశలూ కృషి చేస్తుందని​ ​అన్నారు.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;