అసెంబ్లీ లో బూతులు..!!

 

 

పవిత్ర దేవాలయమైన అసెంబ్లీలో వైకాపా సభ్యులు బూతులు మాట్లాడుతున్నారని...స్పీకర్ను సీఎంను తిడితే ఏదో గొప్ప అనుకుంటున్నారని...హుందాతనం కాపాడుకోవలని వైకాపా సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. జగన్ టీడీపీపై బురద జల్లేందుకు తెరాస కేసీఆర్ తో లాలూచీ పడ్డారని..జగన్ హరీష్ రావు ఎక్కడ సీక్రెట్ గా కలుసుకున్నారో..వారి రహస్య ఎజెండా డాక్యుమెంట్ కూడా తన వద్ద ఉందని చంద్రబాబు అన్నారు.

 

జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ నీ తండ్రి 25 ఎంక్వైరీలు వేసినా నన్నేమి చేయలేకపోయాడు...నువ్వు ఎవ్వరితో లాలూచీ పడినా నన్నేం చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిప్పు లాంటోడినని..అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని అన్నారు. ఏ అవినీతి పరుడిని తాను వదిలిపెట్టనని..ఇందుకు సంబంధించిన చట్టం కూడా రెఢీ అవుతోందంటూ చంద్రబాబు జగన్ పై ఆగ్రహంతో ఊగిపోయారు.