నల్లపరెడ్డిని వెంటాడుతున్న నిఘా
posted on Mar 14, 2012 4:59PM
నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీస్ నిఘా విభాగం వెన్నంటి తిరుగుతోంది. ప్రస్తుతం రెండు ప్రత్యేక నిఘా విభాగాలు కోవూరులో ఉన్నాయి. ఒక నిఘా విభాగం ఆయన ఇంటివద్ద మకాం వేసింది. ఇంటికి ఎవరెవరు వస్తున్నారో వారి పేర్లను, కార్ల నంబర్లను నోట్ చేసుకుంటోంది. మరి బృందం ఆయన ఎక్కడికి వెళితే అక్కడకు వెన్నంటి వెళుతోంది. ఎందుకు తనను ఇలా వెన్నాడుతున్నారని నల్లపురెడ్డి ప్రశ్నిస్తే ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తిరుగుతున్నామని నిఘా సిబ్బంది చెబుతున్నారు. నిజానికి కోవూరులో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా రాలేదు. అందువల్ల ఎన్నికల కోడ్ కూడా ఆయనకు వర్తించదు. కానీ ఎన్నికల సంఘం సాకుతో నిఘా బృందం ఆయనను వెంటాడటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతలు పోలీసుల ద్వారా నల్లపురెడ్డి కదలికలు తెలుసుకునేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు తెలిసింది.