జగన్ కేసు పై సుప్రీం లో విచారణ వాయిదా
posted on Sep 9, 2011 12:26PM
న్యూ
ఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్ కేసుపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ జగన్ అస్తులపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేయాలని కోరుతూ రెండు లీవ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటషన్లపై విచారణను సుప్రంకోర్టు ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్ కేసును కూడా ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో కలిపి విచారిస్తామని న్యాయమూర్తులు చెప్పారు. అయితే. దానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రంనాయుడు తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. రెండు కేసులను వేర్వేరుగా విచారిస్తామని, అయితే ఒకే రోజు రెండు కేసులను విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.