టీడీపీకి హరీష్ రావు ఆఫర్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజా ప్రతినిధులు తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తే వారితో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు గురువారం అన్నారు. పదవులకు దూరంగా ఉండాలన్న టిడిపి నేతలకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే వారు ముందుగా తమ రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలన్నారు. అలా చేస్తే వారి ఏ సవాళ్లనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణపై ఇప్పటికీ టిడిపి వైఖరి స్పష్టంగా లేదన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు మరోసారి రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. టిడిపి, కాంగ్రెసు రాజీనామా చేస్తే బాన్సువాడలో పోటీ చేయమన్నారు. తమ కుటుంబ సభ్యులెవరికీ ఎమ్మార్‌లో విల్లాలు, ఫ్లాట్‌లు లేవన్నారు. ఎమ్మార్ విల్లాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని వాటిని భూ నిర్వాసితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంటే ఎన్‌కౌంటర్ చేస్తానన్న వరంగల్ జిల్లా రూరల్ డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థులను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu