మీడియాపై జగన్ చిందులు
posted on Sep 8, 2011 4:25PM
న్యూ
ఢిల్లీ: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మీడియాపై చిందులు తొక్కారు. అక్కడ సిబిఐ మా జీవితాలతో ఆడుకుంటుంటే మీకు సినిమాలా కనిపిస్తోందా అని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అనంతరం బయటకు వస్తుండగా విలేకరులు జగన్‌ను చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన జగన్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని కలిసి తనపై సిబిఐ దర్యాఫ్తు కుట్ర పూరితంగా జరుగుతుందని ఫిర్యాదు చేశారు. దానికి ప్రధాని ఘాటుగానే స్పందించి తాము ఎలాంటి కక్షలకు పాల్పడమని క్లాస్ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో తీవ్ర అసహనానికి గురైన జగన్ మీడియాపై తన అసహనాన్ని ప్రదర్శించారు. కాగా రెండు రోజుల క్రితం గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుపై స్పందించమని మీడియా ప్రశ్నించినప్పుడు కూడా ఇలాగే అసహనం వ్యక్తం చేశారు.