నేడు నరసన్నపేటలో వైఎస్‌ విజయమ్మ ప్రచారం

వైఎస్‌ విజయమ్మ నేడు నరసన్నపేట నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో విజయమ్మ నర్సన్నపేట నియోజకవర్గానికి వస్తారు. నియోజకవర్గంలోని 'మడపాం' నుంచి ప్రచారానికి ఆమె శ్రీకారం చుడతారు. కొమర్తి, మబుగాంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. నర్సన్నపేటలో జరిగే బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడతారు. వైఎస్‌ విజయమ్మకు విశాఖ ఎయిర్‌పోర్టులో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో విమానాశ్రయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పార్టీ జెండాలు చేతబట్టి విజయమ్మను ఆహ్వానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu