లగడపాటి రిసార్ట్స్‌లో పేలుడు కేసులో నలుగురు అరెస్ట్

కొండాపూర్‌లోని లగడపాటి ప్లాసిడా రిసార్ట్స్‌లో బాంబు పేల్చిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్‌కు చెందిన శివకుమార్, రాజు, ఆనంద్, శ్రీకాంత్‌లుగా వారిని గుర్తించారు. ఈనెల 16న శివకుమార్ తెల్లాపూర్ రైల్వే బ్రిడ్జ్ కింద పేలుడు పదార్ధాలు అమర్చి తొలగించాడు. ఈ నెల 24న లగడపాటి ప్లాసిడా రిసార్ట్స్లో జిలెటిన్ స్టిక్స్ అమర్చాడు. నిందితుల వద్ద నుంచి డిటోనేటర్ వైరు, వీడియో కెమెరా, క్యాప్, 9,500 రూపాయల నగదు, 5 సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.నిందితులను మీడియా ప్రతినిధుల ఎదుట మాట్లాడనివ్వడానికి కూడా డిఎస్పి నిరాకరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu