వైఎస్ అవినీతికి బాధ్యత వహిస్తారా?

అనంతపురం: కడప ఉప ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మ పెట్టుకోవడానికి పోటీపడుతున్న కాంగ్రెస్, జగన్ లు ఆయన అవినీతికి కూడా బాధ్యత వహిస్తారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఉప ఎన్నికలపై ఆయన అనంతపురంలో మాట్లాడుతూ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు కడపకు తరలివెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ కులాల ప్రస్తావన తీసుకొస్తూ దిగజారుడు రాజకీయం చేస్తోందని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu