8వ అధ్యాయం వెల్లడిపై హైకోర్టు స్టే
posted on Apr 25, 2011 1:45PM
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీకి హైకో
ర్టు డివిజన్ బెంచ్ నుంచి ఊరట లభించింది. రహస్యంగా ఉంచిన కమిటీ ఎనిమిదో అధ్యాయాన్ని వెల్లడించాలని హైకోర్టు సింగిల్ జడ్డి ఇచ్చిన తీర్పుపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం స్టే ఇచ్చింది. తెలంగాణ ఉద్యమంపై శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయంలో వ్యాఖ్యలు చేసిందని, దాన్ని వెల్లడించాలని కోర్టుకెక్కారు. ఎనిమిదో ఆధ్యాయాన్ని వెల్లడించాలని సింగిల్ జడ్జి బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై ప్రభుత్వం ఇద్దరు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్‌కు అపీల్ చేసుకుంది. కమిటీ ఎనిమిదో అధ్యాయాన్ని సీల్డు కవరులో తమకు అందించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది. తన నివేదికలోని ఎనిమిదో అధ్యాయాన్ని కమిటీ సీల్డు కవర్‌లో కేంద్ర హోం మంత్రి చిదంబరానికి అందజేసింది. దాని బహిర్గతం చేయరాదని కోరింది.