వివేకాకు విజయమ్మ కౌంటర్
posted on May 30, 2011 5:13PM
పులివెందు
ల: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మాజీ మంత్రి, మరిది వైయస్ వివేకానందరెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. సోమవారం బెంగుళూరు నుండి తన నియోజకవర్గం అయిన పులివెందుల చేరుకున్న వైయస్ విజయమ్మ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇక నుండి వారానికి మూడు రోజులు నియోజకవర్గంలోనే ఉండి ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ద పెడతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధికి సమయాన్ని కేటాయిస్తానని ఆమె చెప్పారు. అయితే గత ఉప ఎన్నికలకు ముందు విజయమ్మపై పోటీ చేసిన మరిది వైయస్ వివేకానందరెడ్డి విజయమ్మ నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండదని ప్రజలకు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆమె వివేకానందరెడ్డి మాటలను వమ్ము చేస్తూ వారానికి మూడు రోజులు నియోజకవర్గంలో ఉంటానని హామీ ఇచ్చింది.