షూటింగ్ లో గాయపడ్డ రాజశేఖర్

చెన్నై:  ‘మహంకాళి’ చిత్ర షూటింగ్‌లో హీరో రాజశేఖర్ సోమవారం గాయపడ్డారు. ఆయన సతీమణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహంకాళి సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు కుడి చేతికి, కన్నుకు గాయమైనట్టు సమాచారం. చెన్నైలో జీవిత దర్శకత్వంలో మహంకాళి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాలను డైరెక్టర్ జీవిత చిత్రీకరిస్తున్నారు. ఓ రిస్కీ షాట్ చేస్తుండగా రాజశేఖర్ ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన రాజశేఖర్‌ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు 25 రోజులు విశ్రాంతి అవసరమని, ప్రమాదమేమి లేదని డాక్టర్లు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu