జగన్ ను ప్రశంసించిన రోజా
posted on Nov 20, 2011 12:59PM
హైదరాబాద్: ది
వంగత హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చలువతో పదవులు పొందిన వారు ఇప్పుడు తనను, తన తండ్రిని విమర్శిస్తున్నప్పటికీ జగన్ ఏమీ అనకుండా ఉంటున్నారని అదే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆ పార్టీ నేత రోజా ఆదివారం కొనియాడారు. కాంగ్రెసు నేతలు జగన్‌ను విమర్శించడాన్ని ఆమె తప్పుపట్టారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవు కాబట్టే జగన్ సిబిఐ విచారణకు హాజరవుతున్నారన్నారు. పలువురు ఎమ్మెల్యేలు జగన్ నుండి దూరమవుతున్నారన్న వార్తలు కేవలం మీడియా కథనాలేనని ఆమె కొట్టి పారేశారు.
కాగా గతంలో వైఎస్ ఫధకాలు నచ్చాయని చెప్పి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెడుతున్న పధకాలు బాగున్నయన్నయన్న ఎమ్మెల్యె జయసుధ మాటల్లో అర్ధమేమిటో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా కోరారు.తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జయసుధ తమ పార్టీలోకి ఎందుకు వచ్చి ఎందకు వెళ్ళుతున్నారో చెప్పాలన్నారు. వైఎస్సార్ పార్టీకి ప్రజల అండ ఉందని తమకు ఎమ్మెల్యెలు ఎంపీలతో పనిలేదన్నారు.మధ్యంతర ఎన్నికలు వస్తాయనుకుంటే తాము అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడానికి మున్డుకోస్తామన్నారు .