జగన్ కు మరో షాక్ ..
posted on Nov 20, 2011 12:49PM
హైద
రాబాద్: ఇన్నాళ్లూ జగన్ వర్గంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యుడు శేషారెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు,జగన్మోహన్ రెడ్డికి ఝలక్ ఇవ్వనున్నారు.జగన్ కు మద్దతిచ్చే శాసనసభ్యుల నుండి మరో వికెట్ డౌన్ అయింది. శేషారెడ్డి ఆదివారం సాయంత్రం రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు అధికారకంగా ప్రకటించనున్నారని సమాచారం. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయినందున వాటి కోసమే తాను కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు ఆయన చెప్పారు.
ఇన్నాళ్లూ దమ్ముంటే తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ వచ్చిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు శీతాకాల సమావేశాలకు ముందు అదీ తెలుగుదేశం పార్టీ తాము కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని ప్రకటించిన తర్వాత ఒక్కరొక్కరూ సొంతగూటికి చేరుకుంటుండటం విశేషం. ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా ప్రకటించిక పోయినా దాదాపు మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెసులోకి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.