సర్కారుకు కొనసాగే అర్హత లేదు: ఎర్రంనాయుడు
posted on Nov 20, 2011 1:17PM
హైద
రాబాద్: సీఎం కిరణ్‌కు అధికారులపై, మంత్రులపై పట్టు లేదని టీడీపీ అగ్రనేత ఎర్రన్నాయుడు ఆరోపించారు.అయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లో విఫలమయిన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారుకు కొనసాగే అర్హత లేదని అన్నారు.రచ్చబండ దరఖాస్తులు చెత్తకుండీలో వేస్తున్నారని, అటువంటప్పుడు ఈ కార్యక్రమం ఎందుకని ఆయన ప్రశ్నించారు. వైద్యం అందక గిరిజనులు మృతి చెందినట్టు ఆ శాఖ మంత్రే అంగీకరించారని, మందుల్లేవని చెబుతున్నారని, ఇటువంటప్పుడు ప్రభుత్వమెందుకన్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి గంట ముందే అవిశ్వాస తీర్మానం నోటీసులిస్తామని ఆయన తెలిపారు.వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతామని స్పష్టం చేశారు. అవిశ్వాసం పెడితే మద్దతు ఇస్తామని చెప్పిన వారి అసలు రంగు అప్పుడు బయటపడుతుందన్నారు.