సూరీడు ఏం చేస్తున్నాడు ?
posted on Apr 5, 2012 6:50AM
వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు, అనుంగు సహాయకుడు అయిన సూరీడు కాలం కలసిరాకపోవడంతో ప్రస్తుతం అజ్ఞాతవాసంలో ఉన్నాడు. రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ కుటుంబం సూరీడును దూరంగా పెట్టింది. రాజశేఖరరెడ్డి హయాంలో చక్రం తిప్పిన సూరీడు వైఎస్ ఆశీస్సులతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడని తెలిసింది. వైఎస్ మరణాంతరం సూరీడు జగన్ కు దగ్గరకావడానికి ప్రయత్నించాడు. అయితే జగన్ చుట్టూ ఉన్న కోటరీ మాత్రం సూరీడును ఏమాత్రం దగ్గరకు రానీయలేదు. దీంతో నిరాశకు గురైన సూరీడు కొంతకాలం అజ్ఞాతవాసంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన బొత్స సత్యనారాయణ పంచన చేరినట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ కుటుంబానికి సూరీడుకు మధ్య సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో సూరీడు బొత్స వెనకాల చేరి తాజా పరిణామాలపై తనకు తెలిసిన సమాచారాన్ని బొత్సకి కందజేస్తూ సలహాలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. తనను జగన్ కుటుంబం దూరంగా ఎందుకు పెట్టిందో ఇప్పటికీ అర్థంకావడం లేదని సూరీడు సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది.