పార్టీ మారే నేతలు తెలియక జగన్ తికమక..!
posted on Jan 9, 2016 5:22PM
.jpg)
వైసీపీ పార్టీ నుండి కర్నూలు జిల్లాకు చెందిన 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారతున్నట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ అధినేత జగన్ పార్టీ మారే యోచనలో ఉన్న నాయకులు ఎవరా అని ఆరా తీసుకునే పనిలో పడ్డారంట. అయితే ఎవరిని అడినా తాము పార్టీ మారడం లేదు అని చెబుతున్నారే తప్ప ఎవరూ కూడా పార్టీ మార్పుపై ఎలాంటి విషయం చెప్పడంలేదట. దీంతో జగన్ కు ఎవరు పార్టీ మారుతున్నారో తెలియక తికమకపడుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఏం చేయాలో తెలియక సొంత పార్టీ నేతలపైనే నిఘా ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందట. ఇదిలా ఉండగా జగన్ పార్టీకి చెందిన ఐదురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని… వారి రాకను వ్యతిరేకించవద్దని కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా పర్యటనలో జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పడంతో అసలు కథ మొదలైంది. మరి చంద్రబాబు నిజంగానే అన్నారా.. లేక ఏదన్న రాజకీయ గేమ్ ప్లే చేశారా అన్నది ఇప్పుడు అందరి సందేహం.