ఎంత రచ్చ అయితే జగన్ కు అంత మంచిది..

 

దీక్షలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవరైనా ఉన్నారంటే అది వైకాపా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డే. విషయం ఏదైనా కానీ.. అందులో విషయం ఉందా లేదా అన్నది కూడా ఆలోచించకుండా అధికార పార్టీని విమర్శించడానికి దీక్షలు చేస్తునే ఉంటారు. ఇప్పుడు జగన్ ప్రత్యేకహోదా కోసం దీక్ష చేయబోతున్నారని అందరికి తెలిసిన విషయమే. ఈనెల 26న గుంటూరులో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్టు ఎప్పటినుండో తెలిసిందే. గతంలో కూడా జగన్ ప్రత్యేక హోదా కోసం నిరసనలు చేశారు.. ఇక్కడ కాదన్నట్టు ఢిల్లీలో కూడా ప్రత్యేక హోదా కోసం  దీక్ష చేశారు. అయితే అప్పుడు అక్కడెక్కడో దీక్ష చేసిన రచ్చ కాలేదు కాని ఇప్పుడు ఇక్కడ చేస్తున్న దీక్ష విషయంలో మాత్రం రచ్చరచ్చ అవుతోంది. ఎందుకంటే జగన్ ఎప్పటినుండో దీక్ష చేయాలని నిర్ణయించుకున్నప్పుడే గుంటూరులో మూడు చోట్ల స్థలాన్ని ఎంపిక చేసుకొని.. వాటిలో ఒక దానికి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు ఆమూడు కాకుండా వేరే చోట స్థలాన్ని ఎంచుకోండంటూ ట్వీస్ట్ ఇచ్చారు. ఇక అంతే జగన్ సైన్యం ఊరుకుంటుందా ఏపీ ప్రభుత్వం మీద విరుచుకుపడుతోంది. కావాలనే అనుమతి ఇవ్వడం లేదని.. అధికార పక్షం కావాలనే దీక్షకు అడ్డు తగులుతుందని విమర్శలు గుపిస్తున్నారు. అంతేకాదు ఏది ఏమైనా తాము అనుకున్న చోటునే దీక్ష చేస్తామని.. పోలీసులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాము దీక్ష చేసి తీరుతామని జగన్ బ్యాచ్ అంటుంది.

ఇదిలా ఉండగా ఈ దీక్ష విషయంలో జగన్ పార్టీ రచ్చ చేయడం కంటే ప్రభుత్వమే ఎక్కువ రచ్చ చేస్తుందనే రాజకీయ వర్గాల టాక్. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం.. వేరే స్థలం చూసుకోమనడం ఇవన్నీ ఈ రచ్చకు కారణమని అంటున్నారు. మరోవైపు జగన్ బ్యాచ్ కూడా ఎంత రచ్చ అయితే అంత మంచిది.. ఇలాగైనా ప్రభుత్వం వల్ల ఉచిత ప్రచారం దక్కుతుంది అనే ఆలోచనలో ఉన్నారంటా. జగన్ దీక్షకు ప్రభుత్వం భయపడుతోందనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళుతుండటంపై జగన్ బ్యాచ్ ఫుల్లు హ్యాపీగా ఉన్నారంట. మొత్తానికి ఇంకా దీక్ష ప్రారంభం కాకముందే ఇంత రచ్చ అయితే దీక్ష ప్రారంభమైతే ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి..