యోగ సాధనతోనే ఆరోగ్యం?

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నియు ఎన్ ఓ పిలుపు మేరకుజరుపుకోడం అంతర్జాతీయంగా 
మన యోగకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.యోగ,యోగసాధన, యోగ అంటే వాటిగురించి చెప్పిన ఆధారాలను చారిత్రిక ఆధారాలను తెలుసుకుందాం. యోగా అంటే ? వ్యాయామం అని అనుకుంటారు కొందరు దీనిని లోతుగా పరిశీలిస్తే ఇంకొందరు అధ్యాత్మిక సాధనలో  యోగ ఒక భాగమని అంటారు కొందరు. మోక్ష సాధనకు మార్గం యోగా అని కొందరు పేర్కొన్నారు. యోగా సాధన ద్వారా అంతః దృష్టి ద్వారా పరమానంద ప్రాప్తి పోడే వీలు న్న  సాధన క్రియ యోగసాధన అంటారు. యోగా సాధన చేసేవారిని యోగులని అంటారు.వీరిని సన్యాసులు గాను, మునులుగా ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ అందరి చేత యోగా సాధన చేయిస్తున్నారు మహా యోగులు.ఆశ్రమాలాలో హట యోగము  శారీరక  ఆసనాలు వేయడం ద్వారా  ఔషదాలు వాడకాన్ని తగ్గించ వచ్చని తద్వారా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. 

యోగ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుందాం...

పురానాలలో యోగ సాధనానికి అధ్యుడు పతంజలి అంటారు. 100- 500  శకం లోనే యోగా ప్రారంభమైనదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.వేదం ,పురాణాలు,ఉపని షత్తుల లో రామాయణ, మహాభారతం లోనూ యోగా ప్రస్తావన ఉంది. యోగ సాధనా పద్దతుల గురించి సూత్రాలు, ముద్రలు, సాధన ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండచ్చు అని పేర్కొన్నారు. యోగాలో కర్మయోగం, జ్ఞాన యోగ, రాజ యోగం, బక్తి యోగం గా విశ్లేషించారు. వ్యాసముని రచించిన భగవత్ గాతను 18 భాగాలుగా విభాజించారు.
యోగము అంటే ఏమిటి? యోగము అంటే కలయిక యూజ్ అంటే కలయిక అనే సంస్కృత ధాతువు నుండి యోగము అనే పదం ఉత్పన్న మైంది.యజ్యతే అనేన ఏతా ధితి యోగః  యోగము అంటే ఇంద్రియాలను వశపరచు కోవడము అని అర్ధము.మానవుని శక్తి ని ఏక తాటి పైకి తెచ్చి సమాన స్థితికి తెచ్చేది యోగ ఏకా గ్రతను సాధించడం యోగాలో మాత్రమే. సాధ్యం. మానవులలో వచ్చే ఆలోచనలను భగ్నం చేసే  పరమార్ధ తత్వానికి మార్గం చూపేది యోగమే. వ్యక్తిలో నిడ్రాణ మైన మేల్కొలిపేది జాగృతం చేసేది యోగ మార్గం. అంతర్గతంగా  ఇంద్రియ నిగ్రహం,చేయడం, మనో నిగ్రహం, మనో నేత్రం తో రాబోయే ఘటనలను,జరుగుతున్న సత్యా లను చెప్పగల ఇంద్రియ జ్ఞానాన్నిమనకు అందించేది యోగమే. యోగము అంటే అదృష్టమని మరో పేరు. యోగము అంటే సాధన, భగవద్గీత లో అధ్యా యాలను యోగములని పేర్కొన్నారు.దీనిలో,యోగాలో మరికొన్ని పేర్లు ఉన్నాయి  ఆష్టాంగ యోగం,పతంజలి యోగ, రాజయోగ అని పేర్కొన్నారు.యోగ సాధన తోనే సమాధి పద,సాధనపద, కర్మయోగ, రాజ యోగం. విభూతి యోగా-జాగరూకత సాధన,ద్వారా నిపునుత సాధన గురించి వివరించారు.కైవల్య పదయోగం -మోక్ష సాధన యోగా శాస్త్రంలో ఆఖరి గమ్యం.

పురాణాలలో యోగసాధన సాక్ష్యాధారాలు...

ఈశ్వరుడు తపస్సు చేసి నపుడు పద్మాసనంలో ధ్యాన యోగంలో ఉన్నదని పురాణాలలో పేర్కొన్నారు.
పద్మాసినీయే - మహావిష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడింది.సింధు నాగరికతలో ని చిత్రాల ఆధారంగా యోగా నాగరికతలో నే ఉందని విశ్వసిస్తున్నారు.యోగాలో ప్రాణాయామాలు 8.యోగా ముద్రలు 3 రకాలు,ఇందులో ప్రాణాయామల ద్వారా పరకాయ ప్రవేస్శాలు చేయడం అంటే యోగ విద్యాతో క్రీడించడం కొన్ని కధాలలో వర్ణించారు. యోగా ద్వారా శారీరక  డ్డారుడ్యం, ముఖ వచ్చస్సు పెరుగు తుంది. మానసికంగా దృదంగా ఉండాలంటే యోగా,అవసరమని మానసిక సంకల్పన్ని పెంచేది విజయ పదం లో నడిపింఛేది యోగా అన్నమాట నూటికి నూరు పళ్ళు నిజం.యోగని ప్రపంచానికి అందించిన ఘనత మన పోర్వీకులదే యోగా మనదేశంలో పుట్టిన యోగా పట్ల మనం గౌరవ సూచకంగా యోగా మహాత్ములు మనకు ఇచ్చిన బహుమతి. మనాజీవితాన్ని ప్రభావితం చేసేది యోగా.ఒక మిలియన్ ప్రజలకు అయినా యోగా అందించాలన్నదే ముఖ్యం.1400 స్త్రీలు బాలబాలికలు,  భారత్ లో సహకరించడం మనకు గర్వకారణం.ఇక మనలను పట్టి పీడిస్తున్న కోవిడ్ 19 సమయంలో 
మన ఇమ్యూన్ బూస్ట్ ను పెంచేది యోగాతోనే.ఉదాహరణకు కోవిడ్ వల్ల ఒక పక్క అనారోగ్యం మరోపక్క మానసికంగా ఎదుర్కొ వాలంటే యోగా ఒక్కటే మార్గం. ప్రస్తుతం యువత పోటీని తట్టుకోలేక ఆత్మ హత్యకు పాల్పడడం మానసిక ద్రుడత్వం లేకపోవడం.మనలను అనారోగ్యం పాలు చేస్తుంది.మానసిక అనారోగ్యానికి మందు లేదు అయితే యోగాతో మానసిక అనారోగ్యాన్ని జయించే శక్తి యోగాకే ఉంది.కోవిడ్ నుండి ఉపసమనానికి యోగా తరగతుల వల్ల జీవితంలో మార్పు  తీసుకు రావచ్చు.  ఒక దీపం తో వెలును నింపవచ్చు యోగ సాధన చేసేకొద్ది మనజీవితం మరింత ప్రభావవంతంగా వెలుగులు నింపు తాయి .అందుకే యోగ సాధన నిత్యం మనాజీవితంలో భాగమైతే అందరం ఆరోగ్యంగా ఉండవచ్చు.ఇదే మనం యోగాడే సందర్భంగా మనము యోగా ను గౌరవించాలి.