యోగాతో ఆరోగ్యం ఆనందం

స్త్రీ ఆరోగ్యానికి యోగా...
యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం మహిళలకోసం.
ప్రతిరోజూ యోగా చేయవచ్చు. యోగ ఆసనాలు ముఖ్యంగా ఇంట్లో ఉండే స్త్రీలు. అంటే ఇంటి పనులు చేసుకునే మహిళలుఅయినా సరే వారు వారి ఆరోగ్యం పై శ్రద్ధ చూపరు.కారణం వారికి సరైన సమయం దొరకదు.ప్రతిరోజూ పనిచేసే స్త్రీలు ఎప్పుడు ఎలాంటి యోగాసనాలు వే యాలి ప్రతిరోజూ వారి దిన చర్యలో కొంత సమయం కేటాయించాలని యోగా నిపుణులు సూచించారు. నేటి ఆధునిక కాలం లో మహిళలు సమాజం లో,గృహిణిగా,తల్లిగా, కూతురిగా,భార్యగా,కొన్ని తరతరాలుగా పాత్ర పోషిస్తున్నారు. నేటి కాలం లో ఇంట్లో నాలుగు గోడల మధ్య సామాజిక ఆర్ధిక రాజకీయ రంగాలలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం హర్షించ దగ్గ పరిణామం అన్నిరంగాలలో పురుషులతో పాటు సమాన భాగస్వామ్యాన్ని కోరుతూ పోటీ పడుతున్నారు.సమాజం లో జీవితం లో ప్రతిరంగం లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉండడం వల్ల వారి ప్రాధాన్యత పెరిగింది.అన్ని రకాల బాధ్యతలను పూర్తి చేయాలంటే వారి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం దురదృష్ట కరం ఎందుకంటే భారత పిల్లలు కుటుంబం కుటుంబం లోని ఇతర సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.కుటుంబం పని ఇతర అంశాలాకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక క్రమ పద్దతిలో కార్యక్రమాలాను 1౦౦%   పూర్తి అయ్యేవిధంగా పనిచేస్తూ సంతృప్తి పంచడం మాత్రమే వారికి తెలుసు. అలాంటి సమయం లోనేవారి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.అలాగే ఎటువంటి సమస్య వచ్చినా తాను తీవ్రైబ్బంది పడుతున్నాఒక్కోసారి కుటుంబ సభ్యులకు చెప్పరు. తాము పడుతున్న బాధను పంటిబిగువున ఉంచుకుంటారు.కనీసం ఆసుపత్రికి వెళదా మన్న తరువాత చూద్దామని అంటూ దాట వేస్తారు. ఎంతో కష్టం ఒస్తే తప్ప తమబాధను చెప్పుకోరు. ఇక్కడే మహిళలు అర్ధం చేసుకోవాలి కుటుంబ సభ్యులను చూసుకోవడం,లేదా పనిచేసే చోట ఎదురయ్యే సవాళ్లు సమస్యలు ఎదుర్కోవాలంటే వారు మానసికంగా,శారీరకంగా ఆరోగ్యపరంగా శక్తి వంతులుగా ఉండడం అవసరం.మీరు సమాజానికి కుటుంబానికి మూల స్థంబాలు,మూల స్తంబాలే బలహీనం గా ఉంటె కుటుంబం కట్టడం బలహీన పడుతుంది.అన్న విషయం ప్రతిమహిళా తెలుసుకోవచ్చు.మీ నిత్యజీవితం లో తప్పనిసరిగా యోగా కోసం కొంత సమయం కేటాయించండి.యోగాతోపాటు ఆరోగ్యం గా ఉండే వీలు ఉంటుంది.

ఒకే ఒకమాధ్యమం యోగా...

చాలా మంది మహిళలు ఏమని అంటారంటే అన్నిరకాల బాధ్యతలు నిర్వహిస్తూ ఒక గంట మీకోసం మీఆరోగ్యం కోసం సమయం కేటాయించడం సాధ్యం కాదని.కష్టమని.ఈ కారాణాలు అన్ని కొంతవరకు సరైనదే కావచ్చు.ఉద్యోగినులు అయితే ఉదయం ఇంటి పని ఆపైన ఆఫీసుకు తయారై వెళ్ళాలి మొత్తం రోజంతా ఆఫీసు పనిలో అలిసి పోయిన స్త్రీ సాయంత్రం ఇంటికి చేరుకోవాలి.వాళ్ళ కుటుంబాన్ని చక్క పెట్టుకోవాలి.అదే గృహిణి అయితే పిల్లలు,కుటుంబం కుటుంబ సభ్యులందరి మధ్య ఆరోజు గడిచి పోవడం సహజం.ఇంట,బయట వారు నిర్వహించే బాధ్యతలు నిర్వహిస్తూ ఒక్కోసారి ఒకఘంత పాటు సమయం తమకోసం తమ ఆరోగ్యం కోసం కేటాయించలేకపోతున్నారు.ఈ సమయం లో మేము ఒకగంట సమయం కేటాయించలేకపోతే ప్రతి 15 -2౦ నిమిషాల సమయం కేటాయించు కోవచ్చని. శారీరకంగా మానసిక ఆరోగ్యం పై దృష్టి పెట్టేందుకు మధ్య మధ్యలో యోగ సాధన చేయవచని నిపుణులు సూచిస్తునారు.

ఉదయం వేళ యోగసాధన...

అందరికంటే ముందు నిద్ర లేచేది ఆఇంటి మహిళలె మీరు నిద్ర లేచాక మీ దుప్పటి మడత పెట్టె సమయం.దాదాపు 15 నిమిషాలుముందు నిద్రలేవడం ఆతరువాతే మీ దినచర్యను ప్రారంభించండి.ఆ 15 నిమిషాలు మీకు మాత్రమే కేటాయించండి.మీరు 15 నిమిషాలపాటు మీ మంచం పైన గాని లేదా 
మ్యాట్ పైన గాని ఆసనాలు వేయండి.అందులో సుప్త తాడాసనం,సుప్తవక్రాసనం,సేతుబంధ ఆసనం.ఆ తరువాత రాత్రి 8 నిమిషాలు ఆసనాలు అందులోను అనులోమ వినులోమ ప్రాణాయామం చేయండి.15 నిమిషాల కాలం లో సాధన లో మీశరీరం మొత్తం వ్యాయామం చేసినట్లు అవుతుంది.ఆ విధంగా మీ పంచేంద్రియాలు స్వాసనాళాలు ఇతర అవయవాలు సరిగా పనిచేస్తాయని యోగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మధ్యాహ్న వేళ భోజనానికి ముందు...

మీరు ఇంట్లోన్ ఉంటె నిలబడి లేదా ఆఫీసులో ఉంటె కుర్చీపై కూర్చుని 15 నిమిషాలు సాధన చేయావచ్చు.1౦ నిమిషాలు మాత్రం సూర్యబెదప్రాణాయామం సాధన చేయాలని.15 నిమిషాలు చేసే వ్యాయామం మీ శరీరం సంపూర్ణం గా రక్త ప్రసారం సరిపోతుంది.మీరు శక్తి వంతులుగా అనుభూతి పొందుతారు.

సాయంత్రం వేళలో...

మీరు ఆఫీసునుండి ఇంటికి చేరగానే ఇంటిపనులు ప్రారంభానికి ముందు దాదాపు 1౦ నిమిషాలు సుదీర్ఘ శవాసనం లేదా 1౦-15 నిమిషాలు యోగనిద్ర సాధన ద్వారా రోజంతా మీరు చేసిన అలసట పోతుంది.మీరు చాలా శక్తి మంతులుగా ఫ్రెష్ గా ఉన్నట్లు భావిస్తారు.

రాత్రి వేళలో...

రాత్రి వేళలో మీ భోజనం త్వరగా ముగించే ప్రయాత్నం చేయండి.ఎట్టి పరిస్థితిలో నిద్ర పోయేముందు 2 లేదా 2-౩౦ నిమిషాల ముందు భోజనం చేయాలి. ఉదయం భోజనం కన్నా రాత్రి కొంచం తక్కువగా భోజనం తీసుకోవడం కీలకం.నిద్రకు ఉపక్రమించే ముందు కొంచం అభ్యాసం చేయవచ్చు. ఇందుకోసం విపరీత కారిణి అంటే గోదా ఆధారం గా పోత్తపైకి నిలిపి దాదాపు 5 నిమిషాలు పోట్టద్వారా శ్వాసను పీలుస్తూ సాధన చేయాలి. ఈ ఆసనాల్ సాధన వల్ల మీ పంచేంద్రియాలు పనిచేయడమే కాక మంచినిద్ర పడుతుంది. చిన్న చిన్న అసనాలే చాలా లాభాలు ఉన్నాయి.లేదంటే మీరు రోజంతా నిలబడి ఇంట్లో పని చేసుకుంటూ ఉండటమో లేదా ఆఫీసులో కుర్చీకి అతుక్కుపోయి పనిచేస్తూ ఉండటమో ప్రతిరోజూ ఆసనాలు సాధన చేయడం ద్వారా మీ కళ్ళకు విశ్రాంతి.రోగాలు రాకుండా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.మీ పంచేంద్రియాలు శక్తివంతంగా తయారు అవుతాయి.

దీనితోపాటు మీశరీరంలో రక్త ప్రసారాలు ప్రారంభమౌతాయి.నిద్ర లేమి సమస్య నుండి బయట పడే అవకాశం ఉంది. నియమిత యోగసాధన ద్వారా కేవలం మనం రోగాలు రాకుండా నివారించవచ్చు.మన రోగాలను నయం చేసుకోవచ్చని యోగాసాధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జీవితం లో సకారాత్మక ఆలోచనలు అవసరం కారణం నిరాశ,నిస్పృహ కు కారణం నకారాత్మక ఆలోచనలే మనలను ఓటమి వైపుకు నడిపిస్తాయి. యోగా ద్వారా సకారాత్మకంగా ఆలోచించే శక్తి శరీరం లో ప్రయాణిస్తుంది.యోగా ద్వారా ఆత్మబలం కలుగుతుంది.మనసులో చింత వేరొకరి పట్ల ద్వేషం తగ్గుతుంది. మనసుకు ఆత్మిక శాంతి విశ్రాంతి లభిస్తుంది.మనసులో ఆనందం ఉత్సాహం కలిగిస్తుంది.దీని ప్రభావం నేరుగా మన వ్యక్తిత్వం ఆరోగ్యం పై ప్రభావంచూపుతుంది.

ఒక మహిళ మాన సికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మొత్తం కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.అందుకే ప్రతిరోజూ మీరు ఎంత బిజీగా ఉన్న కొంత సమయం  యోగాసనం తప్పనిసరిగా వేయడం అలవాటు చేసుకోండి యోగాసధన చేయండి ఆరోగ్యంగా ఉండండి.