ఎక్కువగా చలిగా అనిపిస్తూ ఉంటుందా.. ఇదే అసలు కారణం!

చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.  మందం పాటి దుస్తులు దరించినా,  స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది.  అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు  వైద్యులు.  అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..

మానవ శరీరంలో  అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సంక్లిష్టమైన థర్మోర్గ్యులేషన్ వ్యవస్థను ఉపయోగించబడుతుంది. ఇది ప్రతి శరీరం దానికదే నిర్వహించుకుంటుంది. దీనికి నిర్దిష్ట విటమిన్లు,  ఖనిజాలు అవసరం. శరీరంలో ఈ పోషకాలు లోపించినప్పుడు రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది,  జీవక్రియ మందగిస్తుంది. దీని వలన శరీరం తగినంత వేడిని ఉత్పత్తి చేయకపోవడం జరిగవచ్చు.  ఇలా జరిగితే మనిషిలో  సాధారణం కంటే చల్లగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది చాలా వరకు రక్తహీనత లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో వేడిగా ఉండటానికి ఇంటి వాతావరణాన్ని వెచ్చగా ఉంచడం కంటే తినే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం మంచిదని అంటున్నారు వైద్యులు. అంతేకాదు.. కొన్ని పోషకాలు కూడా చలి ఎక్కువ కలగడానికి కారణం అవుతాయట.

ఐరన్,  విటమిన్-బి12 లోపం..

చాలా చల్లగా అనిపించడానికి అత్యంత సాధారణ కారణం ఐరన్  లోపమట. ఐరన్ బాగుంటేనే  హిమోగ్లోబిన్‌ మెరుగ్గా ఉంటుంది. ఇది కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. అదే ఐరన్ లోపిస్తే ఆక్సిజన్ సరఫరా లోపించి చలి పెరగడానికి దారి తీస్తుంది.  

విటమిన్ బి12 లోపం నరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చేతులు,  కాళ్ళు తిమ్మిరిగా ఉండటం,  చల్లగా ఉండటం జరుగుతుంది. మెగ్నీషియం,  ఫోలేట్ కూడా కండరాల సంకోచం,  శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అవసరమైన శక్తిని  ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే..

అకస్మాత్తుగా చాలా చలిగా అనిపిస్తే కాస్త  వ్యాయామం చేయడం మంచిది.  లేదంటే శరీరాన్ని  సాగదీయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. శారీరక శ్రమ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది శరీరాన్ని వెంటనే వేడి చేస్తుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా అల్లం టీ తాగవచ్చు. అయితే అల్లం టీ ఖాళీ కడుపుతో తాగకూడదు.

ఆహారంలో మార్పులు..

శరీరం వెచ్చగా ఉండటానికి  ఆహారంలో బెల్లం, వేరుశనగ, ఖర్జూరం,  మిల్లెట్ వంటి వెచ్చని ఆహారాలను చేర్చుకోవాలి. వెల్లుల్లి,  అల్లం తీసుకోవడం పెంచాలి.  ఇవి రక్త నాళాలను విస్తరిస్తాయి,  రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.  ఆహారం తీసుకున్నప్పటికీ సమస్య కొనసాగితే, వైద్యుడిని సంప్రదించి,  వైద్యుల సలహా మేరకు మందులు లేదా చికిత్స తీసుకోవడం మంచిది.

                                  *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu