వరుస విడాకులు రాజకీయాల్లో ఉండవు.. పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే పైర్
posted on Mar 14, 2021 7:30PM
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో అధికార వైసీపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. పవన్‌పై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తించుకోవాలన్నారు. వరుసగా విడాకులు తీసుకుంటూ ఎన్ని వివాహాలు అయినా చేసుకోవచ్చని, కానీ రాజకీయాల్లో అలా కుదరదని తెలిపారు. రాజకీయాలకు సిద్ధాంతాలు, విలువలే ప్రాతిపదిక అని గ్రంధి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టులను మోసం చేసిన పవన్... ఆపై టీడీపీతో కలిసినా, ఆ పార్టీ నుంచి కూడా విడిపోయారని వెల్లడించారు. ఇప్పుడు బీజేపీతో కలిసిన పవన్ కిందిస్థాయిలో మాత్రం టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుల నీచ రాజకీయాలను ప్రజలు గుర్తించారు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని విమర్శించారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ 8 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు గ్రంధీ శ్రీనివాస్.